రాష్ట్రీయం

ఏపి భవన్ పంపకాలపై చర్చిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ పంపకాలపై కేంద్ర హోంశాఖ కసరత్తును ప్రారంభించింది. ఈ నెల 15న ఏపి భవన్‌పై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఢిల్లీకి రావాలని కేంద్రం ఆహ్వానించింది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు గడచినా ఏపి భవన్ పంపకాలపై వివాదాలకు తెరపడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపి భవన్ ఢిల్లీలో ప్రధానమైన ప్రాంతంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు లోబడి ఏపి భవన్ విభజనపై చర్చించాల్సి ఉందని, దీనిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్రం కోరింది. జనాభా ప్రాతిపదికన ఏపి భవన్‌ను విభజించాలని, దీని ప్రకారం ఏపి భవన్‌లో 52 శాతం వాటా తమకు, తెలంగాణకు 42 శాతం వాటా దక్కుతుందని ఏపి ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. కాని ఈ వాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చాలా సార్లు తోసిపుచ్చారు. మొత్తం ఎపి భవన్‌ను తెలంగాణకు కేటాయించాలని, ఆంధ్రాకు వేరే స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కేంద్రాన్ని కోరుతోంది.
ఏపి భవన్ కట్టిన స్థలం గతంలో హైదరాబాద్ సంస్థానానికి చెందినదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనివల్ల ఆంధ్ర ప్రభుత్వానికి ఏపి భవన్‌లో వాటా లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి పలు పర్యాయాలు లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి లోబడి మాత్రమే ఏపి భవన్ విభజన జరగాలని ఏపి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.