రాష్ట్రీయం

నైపుణ్య యువత పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: దేశీయంగానే అన్ని వస్తువులు తయారు చేసి భారతదేశ బ్రాండ్ ఇమేజిని పెంచేందుకు కేంద్రప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ పథకానికి విశేష స్పందన లభిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సిఐఐ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ది ఇండియా స్కిల్ రిపోర్టు అనే నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే నైపుణ్యం కలిగిన యువతను తయారుచేసుకోవాలన్నారు. మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామని, విదేశాలకు వెళ్లే తెలంగాణ యువతకు సరైన శిక్షణ ఇస్తున్నామన్నారు.
సిఐఐ జాతీయ కమిటీ చైర్మన్ ప్రమోద్ భూషణ్, యుఎన్‌డిపి కంట్రీ డైరెక్టర్ డాక్టర్ జాకో సిల్లర్, మాల్వాయి హై కమిషననర్ డాక్టర్ బూయా ఇసాక్ మున్లో తదితరులు పాల్గొన్నారు.

సిఐఐ సదస్సులో నైపుణ్య నివేదికను విడుదల చేస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయని తదితరులు