ఆంధ్రప్రదేశ్‌

నా ఓటును మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో ఉన్న తన ఓటును ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటున్న తన నివాసానికి మార్చాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసినట్లు తెలిసింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ పరిధిలో ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు. ఆ ఇంటి చిరునామా పేరిట ఓటు హక్కును మార్చాలని ఆయన ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిసింది. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే సదుపాయం ఉన్నా, గత ఏడాది ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్లి పరిపాలనను నిర్వహిస్తున్నారు. దశల వారీగా ఇక్కడ ఉన్న సచివాలయంతో పాటు అన్ని శాఖలను మార్చారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తన పేరును అమరావతికి మార్చుకునే నిర్ణయం వల్ల ఉద్యోగులకు, రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశం ఇచ్చినట్లవుతుందని, అందుకే ఓటును అమరావతిలోని ఉండవల్లికి మార్చాలని కోరుతూ చట్ట ప్రకారం లేఖ ఇచ్చినట్లు తెలిసింది.