ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థి అవయవ దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 12: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదవుతూ ఈనెల 10వ తేదీ రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన నిమ్మనపల్లి మండలం, గురివిరెడ్డిగారి పల్లికి చెందిన ధనంజయరెడ్డి(18) స్విమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఈక్రమంలో ఆ విద్యార్థి తల్లిదండ్రులైన రామిరెడ్డి, శోభారాణి తమ కుమారుడి అవయవాలు దానం చేస్తామని స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ శివకుమార్‌కు తమ అంగీకారం తెలియజేశారు. దీంతో ఇందుకు కావాల్సిన అనుమతులను, ఇతర లాంఛనాలను శివకుమార్ పూర్తి చేశారు. డాక్టర్లబృందం మృతుడు ధనంజయరెడ్డి శరీరం నుంచి తీసిన గుండెను చెన్నై మలర్ ఆసుపత్రికి అత్యంత భద్రతా వ్యవస్థ మధ్య తరించారు. లివర్‌ను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీకి, మరో కిడ్నీని స్విమ్స్‌లో వినియోగించారు. ఈ సందర్భంగా స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్లు, సిబ్బంది ధనంజయరెడ్డి పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. తనప్రాణాలు పోయినా నలుగురికిప్రాణదానం చేసిన ధనంజయుడు ధన్యజీవి అని పలువురు శ్లాఘించారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఎంతో ఉన్నతవిద్యను అభ్యిసించి గొప్పవాడు అవుతాడనుకున్న తమ బిడ్డ 18 సంవత్సరాలకే కానరాని లోకాలకు వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నారు.

అంబులెన్స్‌లతో తప్పని తిప్పలు
ఆటో, క్యాబ్‌ల పరిస్థితీ అదే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 12: ఎవరికైనా ప్రమాదం జరిగినా, లేదా అత్యవసరంగా అంబులెన్స్‌లో ఆసుపత్రులకు చేరాలనుకునే రోగులకు, వారి కుటుంబ సభ్యులకూ పెద్ద నోట్ల మార్పిడి పుణ్యమా అని తిప్పలు తప్పడం లేదు. 108 కాకుండా మిగతా అంబులెన్స్‌ల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ‘చిల్లర ఉందా సారూ!’ అని ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన 500, వెయ్యి రూపాయల నోట్లు తీసుకోమంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఎంతో కష్టపడి ప్రైవేటు ఆసుపత్రికి చేరినా, అక్కడా ఇదే పరిస్థితి. కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు తీసుకోమంటూ గోడలపై కంప్యూటర్ ప్రింట్‌లు పెట్టారు. ఇక ఆటో రిక్షా, క్యాబ్‌ల్లో వెళ్ళాలనుకునే ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సిన వారు క్యాబ్‌లకు ఫోన్ చేసినా కొత్త నోటు ఉందా?, చిల్లర ఉందా? అని డ్రైవర్లు అడుగుతున్నారు. 500, వెయ్యి రూపాయల నోట్లు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు.

శ్రీవారి ఖాతాలోకి నల్లధనం
చేతివాటం చూపించి జేబులు
నింపుకుంటున్న ప్రైవేటు ఏజెన్సీలు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి అనేక ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా తమ వద్ద ఉన్న ధనాన్ని అతి సులువుగా వెంకన్న ఖాతాలోకి తోసేస్తున్నారు. రూ.500, రూ.1000 కట్టలను టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లడ్డూ కౌంటర్, ఇతర నగదు లావాదేవీలున్న కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రలోభపెట్టి తమ వద్ద ఉన్న నగదును మార్చుకుంటున్నారు. తిరుమలలో వడ్డీ వ్యాపారులే కాకుండా కొందరు టిటిడిలో అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులు కూడా ఈవిధంగా చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా టిటిడి కూడా పెద్దనోట్లు తీసుకునే అంశంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.