తెలంగాణ

రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 13: అనివార్య పరిస్థితుల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవించినప్పటికీ తెలుగువారంతా ఎక్కడ ఉన్నా ఒక్కటేనని, సోదర భావంతో కలిసి మెలసి జీవిస్తారని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో రెడ్డి విద్యార్థినుల వసతి భవన ప్రారంభోత్సవానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి దూరం కావడంతో ఉద్యమం ప్రారంభమై విభజన అనివార్యమైందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల్లో అన్నదాతలు భూమిని నమ్ముకుని ఆరుగాలం కష్టపడుతున్నా ఫలితం దక్కకపోగా ఆత్మహత్యలకు దారి తీసే పరిస్థితులు ఏర్పడటం బాధాకరమన్నారు. కల్తీ విత్తనాలు, పురుగు మందుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోందని, వీటి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కష్టపడే స్వభావం స్వతహాగా కలిగిన తెలుగువారు ఎక్కడ ఉన్నా రాణిస్తున్నారని, ప్రస్తుతం అమెరికాలో తెలుగువారి హవా కొనసాగుతోందని అంటూ మనవారు లేకపోతే అమెరికా లేదనే స్థితికి తెచ్చారన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ తరహా వసతి భవనాల నిర్మాణం, నిర్వహణ అభినందనీయమని నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపి యలమంచలి శివాజీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకి వెంకటరెడ్డి, అనవేమా ట్రస్ట్ సభ్యులు చాట్ల అంజిరెడ్డి, గోల్కొండ హోటల్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.