రాష్ట్రీయం

మార్కెట్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దుతో వాణిజ్య, వ్యాపార రంగాలే కాకుండా కూరగాయల మార్కెట్లూ కుదేలయ్యాయి. మరోవైపు రియాల్టీ రంగంపై వంద శాతం ప్రభావం పడింది. కొనుగోలుదారులు ఎవరూ అటువైపు కనె్నత్తి చూసే పరిస్థితి లేదు. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ల రిజిస్ట్రేషనే్ల తప్ప కొత్తగా క్రయ, విక్రయాలు దాదాపు పూర్తిగా నిలిచి పోయాయి. కొనుగోలుదారుల వద్ద కొనడానికి కొత్త నోట్లు లేవు, బ్యాంకుల్లోకి వెళ్ళి డ్రా చేసే పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్దకు వస్తున్న వారు రద్దయిన నోట్లను నిరాకరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రద్దయిన పాత నోట్లు ఉన్నవారు ఈ రకంగానైనా డబ్బును ఉపయోగించాలన్న భావనతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్దకు వెళ్ళి, లేదనిపించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం భారీగా తగ్గిపోవడంతో తాము మరో వ్యాపారం చేయడమో, లేదా ప్రైవేటు ఉద్యోగమో చూసుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి మరో నాలుగైదు నెలలు ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, పలువురు మంత్రులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల వల్ల కూడా రియల్‌పై ప్రభావం పడుతున్నదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని, ప్రభుత్వ పథకాలకు దెబ్బ పడిందని ఇటీవల అనుమానాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కూరగాయల మార్కెట్లపై పెద్ద నోట్ల ప్రభావం భారీగా పడింది. అందుకు కారణం ప్రజల వద్ద చిల్లర డబ్బులు లేకపోవడమే. ప్రభుత్వం తొలుత 500 రూపాయల నోటును విడుదల చేయకుండా, 2 వేల రూపాయల నోటును విడుదల చేసింది. అవీ చాలీ చాలనంతగా విడుదల చేయడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయ.
ప్రజలు బ్యాంకుల నుంచి, ఎటిఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నా, వెయ్యి రూపాయల కంటే పెద్ద నోటైన 2 వేల రూపాయల నోటు వస్తున్నది. నగదు మార్పిడి నాలుగు నుంచి నాలుగున్నర వేలకు మార్చినట్లు ప్రభుత్వం ప్రకటించినా, బుధవారం చాలా బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో నాలుగు వేల రూపాయలే ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే తమకు ఇంకా ఆ విధమైన ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. చాలా ఎటిఎంలలో ఎప్పటిలా నో-క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. నగదు ఉన్న కొన్ని ఎటిఎంల వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయ. కూరగాయల మార్కెట్ల (మండీల)కు గ్రామాల నుంచి ఆకు, కూరగాయలు తీసుకుని వచ్చే రైతుల వద్ద చిల్లర డబ్బులు లేకపోవడం, వచ్చే వినియోగదారులు రద్దయిన పాత నోట్లనో, లేక కొత్తగా చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లను తీసుకుని రావడంతో సమస్య వస్తున్నది. పైగా ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్లలో కొనుగోలుదారుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో రైతులు గ్రామాల నుంచి మార్కెట్లకు తీసుకుని వచ్చిన కూరగాయలను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తున్నది.