తెలంగాణ

ఇక నిధుల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార కార్యకలాపాలు స్తంభించిన ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం డబ్బు వేటలో పడింది. జీతాలు, తప్పనిసరి ఖర్చులకు సరిపోయే విధంగానైనా డబ్బులు సర్దుబాటు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. రద్దయిన నోట్లను డిసెంబర్ 24 వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎంతో కొంత ఖజానాలోకి నిధులు చేరేట్టు చూడాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దీనిపైనే దృష్టిసారించింది. వాణిజ్య పన్నుల శాఖలో చాలాకాలంగా బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. వాణిజ్య పన్నులు శాఖ లెక్కలకు, వ్యాపారులు తాము చెల్లించాల్సిన దానికి మధ్య పొంతన లేకపోవడంతో ఇవి చాలా కాలంగా వసూలు కావడం లేదు. పెండింగ్‌లో ఉండిపోయాయి. గతంలో పలు సమావేశాలు నిర్వహించినా పెద్దగా ప్రభావం చూపలేదు. 1,194 కోట్ల రూపాయల వరకు వాణిజ్య పన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. రద్దయిన నోట్లతో వీటిని చెల్లించే అవకాశం ఉపయోగించుకుని వీటిని వసూలు చేయాలని నిర్ణయించారు. వాణిజ్య పన్నులు చెల్లించాల్సిన డీలర్లకు ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. జీతాలు, పెన్షన్లు, తప్పనిసరి ఖర్చులకు నెలకు దాదాపు ఐదున్నర వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ మేరకైనా నిధులు సమకూరేట్టు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డిసెంబర్‌లో జీతాలు చెల్లిస్తే గండం గట్టెక్కినట్టేనని, ఆ తరువాత పరిస్థితులు చక్కబడడంతో పాటు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రద్దయిన నోట్లను కూడా చెల్లించేందుకు అవకాశం ఉందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇందుకు డీలర్లను ఒప్పించాలని నిర్ణయించారు.
జిహెచ్‌ఎంసి, మున్సిపాలిటీ, హెచ్‌ఎండిఏ, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన బకాయిలు, పంచాయతీల్లో ఆస్తి పన్నును పాత నోట్లతో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించి, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడంతో చాలా ప్రభావం చూపింది. విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, జిహెచ్‌ఎంసి ఆస్తి పన్ను వసూళ్లలో ఈ నిర్ణయం బాగా పనిచేసింది. ఒక్క జిహెచ్‌ఎంసిలోనే వంద కోట్ల రూపాయల వరకు వసూలు అయింది.