ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరు ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని ఆరోపించడంలో అర్థం లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటుబడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. సరైన సమయంలో సరైన ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పాలన కొనసాగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ కాని అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా కొనసాగేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో హంద్రీ-నీవా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయని, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.

రాజధానిలో తొలిసారి కారులో సిఎం పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 17: తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన హెలికాప్టర్‌లో వేదిక వద్దకు చేరుకుంటారని ముందుగా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా రాజధానిలో కారులో పర్యటించారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని అధికార నివాసం నుండి రోడ్డుమార్గంగా వెలగపూడికి కాన్వాయ్‌తో విచ్చేశారు. గతంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినా ముఖ్యమంత్రి రాజధాని గ్రామాల్లో హెలికాప్టర్‌నే ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి కారులో రావడం లేదనే విమర్శలు కూడా వినిపించాయి.

బాలికపై విషప్రయోగంచేసి
హతమార్చిన సవతి తల్లి

ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 17: కడపజిల్లాలో రోజురోజుకు మానవసంబంధాలు మృగ్యమవుతున్నాయి. వివిధ కారణాలతో సొంతవారినే కర్కశంగా హతమారుస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. బద్వేలు పట్టణం రాజుగారివీధికి చెందిన సన (7) అనే చిన్నారిపై సవతి తల్లి షహీరా తినుబండారాల్లో విషం కలిపి హతమార్చింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. బుధవారం సన అసలు తల్లి అబీబ్‌జాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సన మృతదేహాన్ని వెలికితీసి తహసీల్దార్ పుల్లారెడ్డి సమక్షంలో వైద్యులు శవపరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సవతి తల్లి షహీరా తన బండారం బయటపడుతుందని భయమడి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలైన ఆమెను బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. 80శాతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఫయాజుద్దీన్ అనే వ్యక్తి 13 ఏళ్లక్రితం హబీబ్‌జాన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు , కుమార్తె జన్మించింది. మూడేళ్లక్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇద్దరు విడిపోయారు. తండ్రి ఫయాజుద్దీన్ ఇద్దరు పిల్లలను తన వద్దనే ఉంచుకున్నాడు. మూడుమాసాల క్రితం కమలాపురానికి చెందిన షహీరాను రెండవ వివాహం చేసుకున్నాడు. నాలుగురోజుల క్రితమే లడ్డు, మిక్చర్‌లో సనకు సవతితల్లి షహీరా విషం కలిపి తిన్పించింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తండ్రి వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. అయినా అప్పటి పరిస్థితి విషమించి సన మృత్యువాత పడింది. ఆ తర్వాత అంత్యక్రియలు చేశారు. ఈ వ్యవహారం ఇరుగుపొరుగు అసలు తల్లి హబీబ్‌జాన్‌కు తెలియడంతో ఆమె బంధువుల ద్వారా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిఐ రామాంజనాయక్ కేసు నమోదుచేసుకుని శవ పంచనామా చేయించారు. తన నిర్వాకం బయటకు రావడంతో సవతి తల్లి షహీరా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

భార్య, కుమారుడికి విషమిచ్చి
హతమార్చిన కసాయ

కడప,్ఫబ్రవరి 17: కడప నగరానికి ఓ మానవమృగం భార్య, కుమారునిపై విషప్రయోగం చేసి హతమార్చి కన్పించడకుండా పోయారంటూ కట్టుకథ అల్లాడు. తనకేమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదుచేసి మొసలికన్నీరు కార్చాడు. పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. భార్య, కుమారుడ్ని విషమిచ్చి చంపి కడప సమీపంలోని పాలకొండల్లో వారి శవాలను పాతిపెట్టాడు. రెండునెలల క్రితం తన భార్య ఎవరితోనో లేచిపోయిందని ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులు, ఇటు అత్తమామలను నమ్మించిన ప్రవీణ్ చివరకు పోలీసు పరిశోధనలో దొరికిపోయాడు. రెండునెలలుగా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తుచేసి ఎట్టకేలకు భర్త ప్రవీణే భార్య, కుమారుణ్ని హతమార్చినట్లు తేల్చారు. కడప డిఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలో బుధవారం శవాలను పూడ్చిన ప్రదేశానికి హంతకుడిని తీసుకెళ్లి మృతదేహాలను వెలికితీశారు. ప్రవీణ్ నగరంలోని మరియాపురంలో నివాసం ఉంటున్నాడు. ఫిర్యాదు అందినప్పటినుంచి పోలీసులకు అనుమానం వచ్చి ప్రవీణ్‌పై ఓ కనే్నసి ఉంచారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో డిసెంబర్ 11న భార్య నాగేశ్వరి (35), కుమారుడు ప్రణీప్‌రాజు (7)లపై విషప్రయోగం హతమార్చాడు. గుట్టుచప్పుడు కాకుండా పాలకొండల అటవీప్రాంతంలో మృతదేహాలను పూడ్చిపెట్టాడు. అక్కాయపల్లెకు చెందిన ప్రవీణకుమార్‌తో 2003లో ఆమెకు వివాహం అయింది. ఒక కుమారుడు జన్మించాక సంసారంలో కలతలు మొదలయ్యాయి. వీరు గత 11 సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో కుటుంబ పోషణ కోసం ఒక మత పెద్ద వద్ద పంచాయతీ నిర్వహించి నెలకు రూ.3వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిని అవమానం భావించి కక్ష పెంచుకున్నాడు. నాగేశ్వరిని అంతమొందించాలని నిర్ణయించుకుని ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించి డిసెంబర్ 10వ హతమార్చాడు.