తెలంగాణ

నేటి నుండి ఇంద్రజాల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట, నవంబర్ 18: గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు, బాణామతి, చేతబడి వంటితో నలిగిపోతున్న గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యపరచడానికి తాము సైన్స్, మ్యాథమాటిక్ మెజీషియన్‌లతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ప్రముఖ ఇంద్రజాలకుడు, మ్యాజిక్ ఏసియా-2016 ఇంటర్నేషనల్ మెజీషియన్ కనె్వన్షన్ ఉత్సవాల చైర్మన్ సామల వేణు తెలిపారు. శుక్రవారం బేగంపేటలోని రమద మనోహర్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సామలవేణు మాట్లాడుతూ చూమంతర్ పేరితో ‘ఇంటర్నేషనల్ మెజీషియన్-2016’ను సికిందరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో 22 దేశాల నుండి 500 మందికి పైగా మెజీషియన్స్ పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నట్లు సామల వేణు తెలిపారు. శని, ఆదివారం రోజుల్లో సాయంత్రం ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీనితోపాటు మెజీషియన్లకు ఉదయంనుంచి సాయంత్రం వరకు వర్క్‌షాప్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రారంభానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్, హరీష్‌రావుతోపటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు రానున్నట్లు సామల వేణు తెలిపారు.

చిత్రం.. ఇంద్రజాల ప్రదర్శన వివరాలను వెల్లడిస్తూ మ్యాజిక్ చేస్తున్న సామల వేణు తదితరులు