తెలంగాణ

పెద్ద నోట్లు మార్చుకునేందుకే ఢిల్లీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్లను మార్చుకునేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి సెటిల్ చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద నోట్ల వంకతో ప్రజా సంక్షేమ కార్యకలాపాలను నిలిపి వేయాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. పెద్ద నోట్ల మార్పిడిలో జరుగుతున్న వైఫల్యంపై వారం రోజులైనా ఎందుకు స్పందించడం లేదని ఆమె శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని ముఖ్యమంత్రి మీడియాకు లీకులు ఇస్తున్నారని అన్నారు. పెద్ద నోట్లతో ఎదురైన పరిస్థితులను, ఆర్థిక సంక్షోభానికి దారి తీయడం గురించి ప్రధానిని ఎందుకు నిలదీయడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు చెందిన బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ, ఆదానీని కాపాడారని అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు అంత కంటే పెద్దదైన 2 వేల రూపాయల నోటును ఎందుకు చలామణిలోకి తెచ్చారని ఆమె ప్రశ్నించారు.
ఆ ఘనత మాదే..
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని టి.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు అజ్మతుల్లా హుసేనీ, బొల్లు కిషన్ తెలిపారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని వారు శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.