తెలంగాణ

ఆసరాకు 395 కోట్ల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితుల వల్ల ఆసరా పథకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా 395 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నోట్ల రద్దు వంటి పరిణామాలతో ఉపాధి హామీ కూలీ చెల్లించేందుకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని మంత్రి తెలిపారు. ఆసరా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సమీక్ష జరిపారు. పించన్ల చెల్లింపు కోసం ఇప్పటికే 395 కోట్ల రూపాయలు విడుదల చేశామని, చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని పోస్ట్ఫాసులు, బ్యాంకర్లతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. అవసరం అయితే ఆర్‌బిఐ అధికారులతో మాట్లాడి పించన్ల పంపిణీ లో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. నిధులు గత నెలలోనే విడుదల చేసినా నోట్ల రద్దు వల్ల ఉపాధి కూలీలకు కూలీ చెల్లించడం ఆలస్యమైందన్నారు.