తెలంగాణ

హైవే పోలీసు స్టేషన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 18: జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్రంలో నూతనంగా హైవే పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్, బిజాపూర్‌కు వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై కొడంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైవే పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డిలు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో హోంమంత్రి నాయిని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే పోలీస్‌స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం మన్యగూడ, కొడంగల్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. బిజాపూర్, హైదరాబాద్‌కు రహదారి నాలుగు లైన్‌ల నిర్మాణానికి కేంద్రం గ్రిన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. తెలంగాణ పోలీసుల పనితీరు కేంద్ర హోంశాఖ కితాబు ఇచ్చిందని ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణ పోలీసులు దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచారని కితాబు ఇచ్చారన్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ విధానం ఆమలులో ప్రజలతో మమేకం కావడం శాంతి భద్రతల పరిరక్షణకు మరింత దోహదపడిందన్నారు. నరుూం కేసును సిట్ దర్యాప్తు కొనసాగిస్తుందని ఈ కేసులో రాజకీయ నేతలైనా, పోలీసులు ఉన్నా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. 126 కిలోమీటర్ల డెమో కారిడార్‌కు శ్రీకారం చుట్టబోతున్నామని అందుకు రూ.6.33కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.

చిత్రం.. కొడంగల్‌లో హైవే పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తున్న హోంమంత్రి నాయిని, మంత్రి మహేందర్‌రెడ్డి