తెలంగాణ

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగిరెడ్డిపేట్, నవంబర్ 20: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పిడియాక్టు అమలు చేస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెదలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆయన ఆదివారం సందర్శించారు. విత్తన క్షేత్రంలో స్థానిక నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పక్కనే ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులతో చర్చించారు. క్షేత్రంలో నిల్వ ఉన్న సోయా పంట, సాగు చేస్తున్న కంది, క్షేత్రం పంట కాల్వలను, భూమి విస్తీర్ణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిడి యాక్టు కేసుతో పాటు పంట నష్టపోయిన రైతులకు అట్టి విస్తీర్ణంలో వచ్చే దిగుబడికి అనుకూలంగా నష్టపరిహారం, విత్తన కంపెనీల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం.. విత్తనోత్పత్తి క్షేత్రంలో కంది పంటను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రెడ్డి,
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ