తెలంగాణ

పెళ్ళికి నిరాకరించిన యువతిపై కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 21: నిశ్చితార్థం జరిగాక పెళ్ళికి నిరాకరించిందనే ఆవేశంతో నందు అనే యువకుడు డిగ్రీ విద్యార్థినిపై కత్తితో దాడిచేసి గాయపర్చిన సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జైనథ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన సిడాం నందిని ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బి ఎస్సీ చదువుతోంది. అయితే నందినికి బేల మండలం బెల్గాం గ్రామానికి చెందిన గెడం నందు అనే యువకుడితో తొమ్మిది నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్ళి జరపవద్దని కుటుంబ సభ్యులతో గొడవ పడిన యువతి నందిని ఎట్టకేలకు పెళ్ళిని రద్దు చేసుకుంది. తనతో పెళ్ళికి నిరాకరించిందని మనస్తాపంతో కొద్దిరోజులుగా గెడం నందు వేధిస్తూ.. సోమవారం మధ్యాహ్నం కళాశాల నుండి నందిని తన ఇంటికి వెళ్తున్న సమయంలోనే అదనుచూసి యువకుడు నందు బైక్‌పై వచ్చి కత్తితో దాడి చేయగా ఆమె చాకచక్యంగా తప్పించుకొని పరుగులు తీసింది. ఆమె చేతికి, వెన్నుపూస భాగంలో రెండు కత్తిపోట్ల గాయాలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్రమంగా కోలుకుంటుంది. అయితే, పట్టపగలు డిగ్రీ విద్యార్థినిపై కత్తితో దాడిచేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో కలకలం సృష్టించగా స్థానికుల ఫిర్యాదు మేరకు నిందితుడు నందును పట్టణ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.