తెలంగాణ

అనుకరిస్తూ..అనంతలోకాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 22: రియాల్టీషో మోజు ఓ బాలుడి ప్రాణం తీసింది. యూట్యూబ్‌లో ఉన్న ఓ వీడియో సాహస దృశ్యాన్ని అనుకరిస్తూ చేసిన ప్రయోగం వికటించి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిన సంఘటన విషాదాన్ని నింపిం ది. మంటల్లో చిక్కుకుని కాలిన గాయాలతో ఐదురోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన కోడూరి ఘనశ్యాం (12) అనే బాలు డు చివరకు మంగళవారం ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కరీంనగర్‌లో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే...పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడూరి రఘు అనే ప్రైవేట్ ఉద్యోగి. పిల్లల చదువుల కోసం కరీంనగర్‌లోని విద్యానగర్ ప్రాంతం లో నివసిస్తున్నాడు. రఘుకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు అదే ప్రాంతంలోని రత్నం స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఏడవ తరగతి చదువుతున్న రఘు చిన్న కుమారుడు ఘనశ్యాం చదువులో ఫస్ట్ ఉండడమే కాకుండా సైంటిస్ట్ కావాలనే కోరికతో చిన్నచిన్న ప్రయోగాలు చేస్తుండేవాడు. అయితే, యూట్యూబ్‌లో ఉన్న ఓ సన్నివేశా (నోటితో మంటలను ఊ దే)న్ని చూసిన ఘనశ్యాం ఆ సాహసాన్ని చేయాలనుకుని ఈనెల 17న వేకువజామున తల్లిదండ్రులు నిద్రలో ఉండగానే నోటిలో గ్యాస్ పోసుకుని మంటలు ఊదే ప్రయత్నం చేయగా, ప్రమాదవశాత్తు ఆ మంట లు నోట్లోకి, ఛాతీపైకి రావడం తో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని వెంటనే హైదరాబాద్‌లోని ఒక ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. ఘన శ్యాం ఆసుపత్రి లో మృ త్యువుతో పోరాడుతూ చివరకు మంగళవారం మృతి చెందాడు. బా లుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమవిద్యార్థి మృతితో స్కూల్‌కు యాజమాన్యం మంగళవారం సెలవు ప్రకటించింది. బాలుడి మృతదేహాన్ని హైదరాబాద్ నుం చి నేరుగా స్వగ్రామమైన జూలపల్లికి తీసుకెళ్లారు. జూలపల్లిలో బాలుడి అంత్యక్రియలు జరగనున్నాయి.

మృతి చెందిన ఘనశ్యాం (ఫైల్‌ఫొటో)