ఆంధ్రప్రదేశ్‌

వ్యవహార శైలి మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని, ప్రజలను వేధించరాదని హైకోర్టు విజయవాడ పోలీసులకు హితవు చెప్పింది. పోలీసులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విజయవాడకు చెందిన గౌరీశ్వరి అనే మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పోలీసులు తమ తీరును మార్చుకోని పక్షంలో వ్యవస్థ కుప్పకూలుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ డిసిపి కె ప్రవీణ్, పటమట పోలీసుస్టేషన్ హౌజ్ ఆఫీసర్ జి కెనెడీ, ఎస్సై బి సంపత్‌కుమార్ కోర్టు ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఈ కేసులో రమేశ్ అనే వ్యక్తిపై అభియోగాలు వస్తే, కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ కేసులో పిటిషనర్ల కుటుంబ సభ్యులను ధర్మాసం విచారించింది. పోలీసుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయా అని ప్రశ్నించింది. తన భర్తను పోలీసులు నిర్బంధించిన తర్వాత అక్టోబర్ 10 నుంచి 14వ తేదీ మధ్య ఎటిఎం ద్వారా రూ. 3.52 లక్షలను డ్రా చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పిటిషనర్ ఏపి పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది కృష్ణ ప్రకాశ్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో డిసిపి కోర్టు ఎదుట హాజరుకాకుండా మినహాయింపు ఇస్తూ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

టోల్‌ప్లాజా వద్ద రూ. 26లక్షలు నగదు స్వాధీనం
నెల్లూరు, నవంబర్ 23: నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని బూదనం టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 26లక్షల రూపాయలు స్వాధీనంచేసుకున్నామని ఎస్‌పి విశాల్‌గున్నీ తెలిపారు. నెల్లూరులో బుధవారం ఎస్‌పి గున్నీ విలేఖరులతో మాట్లాడుతూ వీటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళవారం రాత్రి నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న వాహనాల్ని టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేయగా చెన్నై నగరానికి చెందిన కాటంరెడ్డి పవన్‌కుమార్‌రెడ్డికి చెందిన కారు వెనక సీటులో ఉన్న స్కూల్‌బ్యాగును పరిశీలించగా అందులో రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు మొత్తం రూ.10లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా సూళ్లూరుపేట వైపు వెళుతున్న మరో కారులో రిజర్వ్‌బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లు, వంద నోట్లు మొత్తం రూ.16.50లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రౌడీషీటర్ దారుణ హత్య

రేపల్లె, నవంబర్ 23: పాతకక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్ నాగరాజు దారుణహత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు వేట కొడవళ్ళు, గండ్రగొడ్డళ్ళతో దాడి చేసి హతమార్చారు. గుంటూరు జిల్లా రేపల్లెలో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. బాపట్ల డిఎస్పీ మహేష్ కథనం ప్రకారం రేపల్లె ఓల్డుటౌన్ 4వ వార్డుకు చెందిన మట్టి నాగరాజు(30) వృత్తి రీత్యా లారీ క్లీనర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి, ఇదే ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ కొలుసు శ్రీరాములుకు ఇటీవల ఘర్షణ చోటుచేసుకుంది. పలుమార్లు శ్రీరాములు వర్గీయులపై నాగరాజు దాడి చేసి గాయపరిచాడు. ఈ నేపధ్యంలో నాగరాజును ఎలాగైనా అంతమొందించాలని భావించిన శ్రీరాములు తన అనుచరులతో కలిసి బుధవారం తెల్లవారుజామున స్థానిక శివాలయం వద్ద మాటువేశాడు. నాగరాజు బైకుపై ఇంటినుండి వస్తుండగా దుండగులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. వేటకొడవళ్ళు, గండ్రగొడ్డళ్ళతో తల, మెడ, ఛాతీలపై నరికి గాయపరిచారు. దీంతో నాగరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని డిఎస్పీ తెలిపారు. ఈమేరకు శివాలయం పూజారి పోలీసులకు సమాచారం అందించటంతో టౌన్ సిఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న నాగరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు తల్లి మట్టి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హంతకుల కోసం గాలిస్తున్నామని డిఎస్పీ చెప్పారు.

ఆరడుగుల
అరటి గెల!
* 600 కాయలు - రూ.650 ధర
రావులపాలెం, నవంబర్ 23: ఆ రకం అరటి ఈ ప్రాంతంలో అరుదు. అయితే ఒక రైతు తన ఇంటి పెరట్లో ఇష్టంగా పెంచిన అరటి చెట్టుకు భారీ సైజులో ఆరడుగుల గెల కాయడంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు. బుధవారం ఆ గెలను కోసి మార్కెట్ యార్డుకు తీసుకురాగా రూ.650 ధర పలికింది. వివరాల్లోకి వెళ్తే... తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన మల్లిడి త్రినాథరెడ్డి అనే అరటి రైతు కర్ణాటక రాష్ట్రంలో చక్కెర కేళీగా పిలిచే బూడిద బక్కీస్ రకానికి చెందిన ఒక అరటి మొక్కను తన ఇంటి పెరట్లో నాటాడు. ఆ మొక్క ఎదిగి కాచిన గెల 6 అడుగుల పొడవుతో భారీ సైజుతో పెరిగింది. పక్వానికి రావడంతో బుధవారం గెలను కోసి, రావులపాలెం మార్కెట్ యార్డుకు సైకిల్‌పై అమ్మకం నిమిత్తం తరలించాడు. దీంతో వ్యాపారులంతా ఆ గెలను కొనేందుకు ఆసక్తి కనబరిచారు. కొమరాజులంకకు చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారి రూ.650కు ఈ గెలను కొనుగోలు చేశాడు. ఈ గెల 6 అరడుగుల ఎత్తుండగా 600 కాయలున్నాయి. 25 అత్తాలు ఉండగా ఒక్కో అత్తంలోను సుమారు 25 వరకు కాయలున్నట్టు వ్యాపారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

నాలుగేళ్ల కొడుకుపై
ఓ తండ్రి దాష్టీకం
నంద్యాల, నవంబర్ 23: అల్లరి చేస్తున్నాడని కొడుకు వీపు చీరేశాడు ఓ కసాయి తండ్రి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన రఫీ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రఫీ మద్యం తాగి ఇంటికి వచ్చినపుడు నాలుగేళ్ల కుమారుడు హిదాయత్ కనిపించలేదు.దీంతో చుట్టుపక్కల వెతకగా హిదాయత్ కనిపించడంతో ఆవేశంతో రగిలిపోతూ ఇంటికి తీసుకువచ్చి వైరు తీసుకుని బాలుడిని చితకబాదాడు. దీంతో హిదాయత్ వీపుపై వాతలు తేలాయి. దెబ్బలకు తట్టుకోలేక బాలుడు వణుకుతుండడంతో తల్లి మాబూనీ రాత్రి నంద్యాల ఆసుపత్రిలో చికిత్స చేయించింది. విషయం బయటకు పొక్కడంతో పోలీసుల జోక్యంతో బాలుడిని బుధవారం ఆసుపత్రిలో చేర్పించింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకె.రవికృష్ణ ఆసుపత్రికి చేరుకుని బాలుడిని పరామర్శించారు.