రాష్ట్రీయం

ఫిరాయింపుదారులకు కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లో చేరిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులకు పెద్ద సమస్య వచ్చి పడింది. నియోజకవర్గాల సంఖ్య పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ బుధవారం రాజ్యసభలో విస్పష్టంగా తేల్చి చెప్పటంతో ఎంతో ఆశతో ఆయా పార్టీల్లోకి ఫిరాయించిన వారికి చిక్కొచ్చిపడింది. నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుందనే ఆశతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది అధికార పార్టీల్లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ పార్టీల నుంచి అధికార పార్టీల్లో చేరి టిక్కెట్లు ఆశిస్తున్న నేతల ఆశలపై కేంద్రం నీళ్ళు చల్లినట్లు అయ్యింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి తమకు బలమైన మండలాలు ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవచ్చని ఫిరాయింపుదారులు ఆశించారు. కేంద్ర మంత్రి చెప్పినట్లు రాజ్యాంగ సవరణ చేయడానికి చాంతాడంత ప్రక్రియ ఉంటుంది. నియోజకవర్గాల సంఖ్య పెంచాలి అంటే రాజ్యాంగంలోని 170(3)ని సవరించాలి. ఇటీవల జిఎస్‌టి బిల్లును ఆమోదించిన తరహాలోనే మొదట ఉభయసభలూ రాజ్యాంగ సవరణకు ఆమోదముద్ర వేయాలి. దేశంలోని 29రాష్ట్రాల ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. అందులో 50శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనంతరం తిరిగి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వీటి సంఖ్యను 152కు పెంచాలని అధికార టిఆర్‌ఎస్ కోరుతోంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 ఉండగా అదనంగా 50 సీట్ల వరకు పెంచాలని అధికార టిడిపి డిమాండ్ చేస్తోంది. దీంతో వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లో పెద్ద సంఖ్యలో చేరారు. టిఆర్‌ఎస్‌లో వివిధ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, ఎపిలో టిడిపిలోకి వైకాపా నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, కొత్తగా నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేతో వివాదం లేకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు భావించారు. తమ పార్టీల్లోకి ఫిరాయించిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకూ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు, టిడిపి అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు పెరుగుతాయన్న భరోసా ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ప్రకటనతో ఫిరాయించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలూ కష్టాల్లో పడ్డట్లే. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును తిరిగి సంపాదించడం అంత తేలికైన విషయమేమీ కాదు. సీట్లు పెరిగితే పక్క నియోజకవర్గాల్లో సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో అటు ఫిరాయించిన వారు, ఇప్పటికే ఉద్యమంలో, పార్టీలో ఉన్న నేతలూ ఆందోళన చెందుతున్నారు. ఎపి టిడిపిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.