ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ రాష్ట్రంలో విఫలమయింది. కొన్ని విద్యాసంస్థలు మినహా మిగిలినవన్నీ యథావిధిగా పనిచేశాయి. అయితే ముందుజాగ్రత్తగా రాజకీయ పార్టీల నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతునిచ్చిన భారత్ బంద్‌కు ప్రజల నుంచి కనీస స్పందన కరవయింది. ఎమ్మెల్యేల పట్టున్న కొద్ది నియోజకవర్గాల్లోనే స్కూళ్లు, షాపులు సాయంత్రం వరకూ మూతపడగా మిగిలిన అన్నిచోట్లా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పనిచేశాయి. విపక్షాల కార్యకర్తలు సోమవారం ఉదయమే రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. షాపులు మూసేయాలని అభ్యర్థించినా పెద్దగా స్పందన కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ స్వయంగా మద్దతు తెలపడంతో అక్కడ మాత్రం వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బంద్ దృష్ట్యా ముందుజాగ్రత్తగా పోలీసులు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్ డిపోల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సాయంతో బస్సులు నడిపారు. వైసిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు దాదాపు అన్ని బస్సు డిపోల వద్ద బైఠాయించి, అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు వారిని అరెస్టు చేసి బస్సులను డిపోలు దాటించారు. ముందుజాగ్రత్త చర్యగా కొందరు కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేయగా, మరికొందరిని ఇతర పోలీసు స్టేషన్లకు తరలించారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నగరంలో జరిగిన బంద్ కార్యక్రమంలో ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ర్యాలీలో బుల్లెట్ నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. మోదీ ఈ శతాబ్దపు తుగ్లక్ అని అభివర్ణించారు. ఏటిఎం, బ్యాంకుల వద్ద నేలకూలుతున్న సామాన్యుల మృతికి మోదీ, చంద్రబాబు నాయుడే కారకులని ఆరోపించారు. బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని కేంద్రంలో మంత్రిగా కొనసాగిస్తూ అవినీతి ప్రక్షాళన గురించి మాట్లాడటం మోదీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నేత బాబూరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వైసిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా పెద్దసంఖ్యలో అరెస్టయ్యారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, సామినేని ఉదయభాను, తదితర అగ్రనేతలను అరెస్టు చేశారు. కాగా భారత్ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కాగా సోమవారం ఇచ్చిన భారత్‌బంద్ పిలుపుప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో అంతంతగానే కన్పించింది. కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాలు, వైసిపి ధర్నాలు నిర్వహించాయి. మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించాయి. రాజమండ్రిలో ప్రఖ్యాత మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ మూతపడింది. వైసిపి, వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా ప్రదర్శనలు జరిపాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాక్షికంగా జరిగింది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలంటూ వైకాపా, వామపక్షాల నేతలు ఉదయమే రోడ్లుపైకి చేరుకున్నారు. నగరంలోని గాంధీబొమ్మ కూడలి నుంచి వైకాపా, సిపిఎం నాయకులు అయ్యప్పగుడి సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నంలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వైకాపా సహా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారంబంద్ పాక్షికంగా ముగిసింది.