ఆంధ్రప్రదేశ్‌

శే్వతపత్రం విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఆలస్యం చేశాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. మెట్రో ప్రాజెక్టు పెరిగిన ధరల ప్రకారం 14,132 కోట్ల రూపాయల అంఛనాతో 2017 జూన్‌కు పూర్తి కావాల్సి ఉండగా, 2020 కంటే ముందు పూర్తయ్యే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారని ఆయన చెప్పారు. సుల్తాన్ బజారు నుంచి, అసెంబ్లీ ముందు నుంచి మెట్రో రైలు వెళ్ళరాదని చెప్పి ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళేందుకు మళ్లీ అనుమతించడం వల్ల జాప్యం జరిగిందని, పైగా 3 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యిందని, దీనిని ప్రభుత్వమే భరించాలని మెట్రో ప్రాజెక్టు సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా రాసిందని రావుల తెలిపారు. పార్టీ నాయకుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారో ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలాఉండగా సోమవారం జ్యోతిరావు పూలే 126వ వర్థంతిని ఎన్టీఆర్ భవన్‌లో టిడిపి నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.

ఎస్సై అదృశ్యం!

విజయవాడ, నవంబరు 28: కుటుంబ కలహాల నేపథ్యంలో నగరంలోని నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ బివి శివప్రసాద్ అదృశ్యమయ్యారు. మూడురోజుల నుండి ఆయన విధులకు హాజరుకావటం లేదు. భార్య లక్ష్మితో కాపురంలో కలహాలు నెలకొనడంతో ఆయన లేఖ రాసి ఇంట్లో నుండి వెళ్లిపోయారు. ఈవిషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. తన ఐడి కార్డు, సిమ్‌లను స్టేషన్‌లో సరెండర్ చేయమని లేఖలో రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం అవి నున్న స్టేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. తనకు ఉద్యోగరీత్యా ఏమైనా ప్రయోజనాలు వస్తే వాటిని భార్య, పిల్లలకు అందజేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. 2009 బ్యాచ్‌కు చెందిన శివప్రసాద్ మంచి పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్నారు. నగరంలోని పోలీసు క్వార్టర్లలో నివాసముంటున్నారు. కాగా, శివప్రసాద్ ఆచూకీ కనుగొనేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

రూ.18.50 లక్షలు స్వాధీనం

అన్నీ రూ.2 వేల నోట్లే

అనంతపురం అర్బన్, నవంబర్ 28: అనంతపురం పోలీసులు రూ.18.50 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు వ్యాపారుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు మూడవ పట్టణ ఎస్‌ఐ కరుణాకర్ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని సోదాచేయగా వారి వద్ద రూ.18.50 లక్షల నగదు లభించిందన్నారు. అందులో అన్నీ కొత్త రూ.2 వేల నోట్ల కట్టలు ఉన్నాయన్నారు. డబ్బు గురించి ఆరా తీయగా బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు తెచ్చినట్లు తెలిపారన్నారు. అయితే వీరి వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఐటిశాఖకు అప్పగిస్తామన్నారు. కాగా అరెస్టయిన వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ నాయకుడు ఉండడం గమనార్హం.