తెలంగాణ

ప్రెషర్ బాంబు పేలి మాజీ సర్పంచ్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్‌జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు. మొన్న తెలంగాణలోని భూపాల్‌పల్లి జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో, నిన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిరోలీ, నేడు ఇదే రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలంపల్లి వద్ద ప్రెషర్‌బాంబులు పేలాయి. సుక్మా జిల్లా పోలంపల్లి-డోర్నపాల్ మధ్య మావోయిస్టులు పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ప్రెషర్‌బాంబుపై పోలంపల్లి సర్పంచ్ వెట్టి బల్లు కాలు వేయడంతో అది పేలింది. ఈ దుర్ఘటనలో అతని కాలు తెగిపోయింది. తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే డోర్నపాల్ అక్కడి నుంచి సుక్మాకు చికిత్స కోసం తరలించారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ దుమ్ముగూడెం మండలం నల్లబల్లి గ్రామం వద్ద మావోయిస్టులు పిఎల్‌జిఏ వారోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రాలు, బ్యానర్లు వదిలారు.