తెలంగాణ

కెటిఆర్..్భష మార్చుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 3: ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ వికలాంగుల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీనగర్, చింతల్‌కుంటలోని పల్లవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ రథ సారథి ప్రొఫెసర్ కోదండరామ్‌లాంటి వారిని సిగ్గు లేదని మాట్లాడటం కేటిఆర్ దొరతనానికి నిదర్శనమని, కేటిఆర్ భాష మార్చుకోవాలని సూచించారు. తనతో కలసి సమావేశంలో పాల్గొన్నందుకు కోదండరామ్‌కు సిగ్గు లేదన్న కేటిఆర్... 2001 నుండి 2007 వరకు కేసిఆర్‌కు కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో ఎంత సహకరించాడో తండ్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశాలలో ఉండి హోటళ్లలో చిప్పలు, బాత్ రూంలు కడిగిన కేటిఆర్‌కు తెలంగాణ ఉద్యమ నేత కోదండరామ్‌ను విమర్శించే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మరచిపోయి వారి పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కేసిఆర్ గోదావరి జిల్లాలో పుట్టిన చినజీయర్ స్వామిని సిఎం కుర్చీలో కూర్చోపెట్టడం సిగ్గుమాలిన చర్య కాదా? అని ప్రశ్నించారు. మదం ఎక్కి దొర అహంకారంతో మాట్లాడుతున్న కేటిఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమయిందని చెప్పా రు. తనతో వేదికలలో పాల్గొన్న కోదండరామ్‌ను సిగ్గు లేదని తిడ్తున్న కేటిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాల పార్లమెంట్‌లో అడ్డుకున్న కాంగ్రెస్ నేత కెవిపితో కేసిఆర్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వర్ రావు, తలసానిలు కేసిఆర్‌కు తీపి అయ్యారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమ కారులు చేదయ్యారని రేవంత్ విమర్శించారు.
8 నెలల కాలంలో 9 ఎకరాల స్థలంలో 150 గదులతో భవనాన్ని ఏర్పాటు చేసుకున్న కేసిఆర్ ఎవడబ్బ సొమ్మని నిర్మించుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విమలక్క కార్యాలయంపై పోలీసులతో దాడులు చేయడంలో అర్థం ఏమిటని ఆయన అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయలేని వికలాంగుల దినోత్సవాన్ని ఎల్బీనగర్ టిడిపి సమన్వయకర్త సామ రంగారెడ్డితో టిడిపి నాయకులు నిర్వహించడం అభినందనీయమని రేవంత్ రెడ్డి అన్నారు. సమావేశానికి ముందు ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంత్‌చారి విగ్రహానికి రేవంత్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.