తెలంగాణ

సిఎం గారూ! ములుగుపై మీ హామీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ప్రకటించాలని టి.టిడిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. 2008 సంవత్సరంలో సమ్మక్క-సారలమ్మ (మేడారం) జాతర సందర్భంగా ములుగు జిల్లా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని ఆమె ఆదివారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. వెనుకబడిన ప్రాంతమైన ములుగు ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరడం తప్పెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల కోరిక మేరకు మద్దతుగా ప్రొఫెసర్ కోదండరామ్, ఎ. రేవంత్‌రెడ్డి, విమలక్క వచ్చారని ఆమె తెలిపారు. కాగా రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు అధికార దురహంకారంతో ఆ సభలో పాల్గొనడానికి ప్రొఫెసర్ కోదండరామ్‌కు సిగ్గుందా అని వ్యాఖ్యానించారని ఆమె చెప్పారు. ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న నెపంతో కుట్రపూరితంగా ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని జైలుకి పంపించిందని ఆమె తెలిపారు. జైలుకు వెళ్ళిన వారంతా నేరస్తులా? అని ఆమె ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది జైలుకు వెళ్ళారని ఆమె గుర్తు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన మీరు 30 సార్లు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. త్యాగాలు ఒకరివి, భోగాలు కెసిఆర్ కుటుంబానికా? అని ఆమె ప్రశ్నించారు. ఇతరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న మీరు సిగ్గు పడాలని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాను తాము వ్యతిరేకించడం లేదని, జయశంకర్ వర్ధంతిని కూడా జరపలేదని ఆమె విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను జాతిపితగా ప్రకటించాలని సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.