తెలంగాణ

ప్రతినిత్యం భగవన్నామస్మరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, డిసెంబర్ 4: ప్రతి మనిషి నిత్యం కనీసం 5నిమిషాలైనా భగవంతుని సన్నిధిలో కూర్చొని భగవన్ నామస్మరణ చేయాలని శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య, హంపి పీఠాధిపతి వీరుపాక్ష విద్యారణ్య భారతిస్వామిజీ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మక్తల్‌లో సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మింప చేసిన దివ్య, భవ్యమైన శ్రీఅయ్యప్పస్వామి దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హంపి పీఠాధిపతి వీరుపాక్ష విద్యారణ్య భారతిస్వామి వారి దివ్యకరకమలములతో నంద్యాలకు చెందిన యాదవల్లి కార్తికేయశర్మ బృందం వేద మంత్రోక్షరణముల మధ్య శ్రీగణపతి, శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీఅయ్యప్ప స్వామి, మాలికపురమాత విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పదునెట్టంబడి, ధ్వజశిఖర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవ అనంతరం విరుపాక్ష విద్యారణ్యభారతి స్వామి మాట్లాడుతూ మక్తల్‌లో అత్యంత వైభవంగా నిర్మించుకున్న శ్రీఅయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభోత్సవం ద్వారా ఈప్రాంత ప్రజలకు అన్ని శుభాలు కల్గుతాయన్నారు. భగవన్ నామస్మరణం ద్వారా వ్యక్తి తనలోని కోపోద్రేకాలను పారద్రోలి ప్రశాంతత పొందగలడని అన్నారు. నేటి సమాజంలో ధార్మిక చింతనతో కూడిన విలువలను కాపాడుకున్నప్పుడే మానవ మనగడకు ప్రాత్పకథ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు బొట్టు, కట్టులతో ఉంటూ తలవెంట్రుకలను విరబోసుకోకుండా చక్కగా జడలు అల్లుకోవడం, కొప్పులు వేసుకుంటే మహిళా సంస్కృతికే ఎంతో గర్వమని అన్నారు. అలా వేసుకోకపోతే అరిష్టంగా భావిస్తారని అన్నారు. భగవన్ నామస్మరణ ముక్తితికి మార్గమని అన్నారు. అయ్యప్ప స్వాములు నియమ నిష్టలతో దీక్షలు కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా విగ్రహదాతలను, ఆలయ నిర్మాణంలో సహకరించిన పలువురిని విద్యారణ్య భారతిస్వామి శాలువలతో సత్కరించారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాద వితరణ గావించారు. అంతకు ముందు విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, బలిప్రదానం, పూర్ణాహుతి, కుంబాభిషేకం, మంగళ శాసనం నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో నేరడగాం పంచమాద్రి మఠం పీఠాధిపతి సిద్దలింగస్వామి, గౌరీశంకర పీఠాధిపతి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అయ్యప్ప విగ్రహం, ధ్వజస్తంభాన్ని ప్రతిష్టిస్తున్న విద్యారణ్య భారతిస్వామి