తెలంగాణ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ అనుమతించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేయాలనుకున్న కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ భవనం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అయితే గాంధీ విగ్రహం వైపు వెళ్ళకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అందుకు ఆగ్రహించిన నాయకులు రోడ్డు పక్కనే అంటే గాంధీ విగ్రహానికి ముందు ఉన్న బ్యారికేడ్ వెలుపల గల ఫుట్‌పాత్‌పైనే బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సమయంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్‌ను జానారెడ్డి పిలిచి అసెంబ్లీ ఆవరణలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అనంతరం ఉత్తమ్, జానారెడ్డి మీడియాతో మాట్లాడారు.