తెలంగాణ

రైతు గొంతు వినిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 7: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బాధ్యత గల రాజకీయ పార్టీగా.. రైతు గొంతుకగా నిలుస్తామని.. అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా అప్పుడు రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను మోసం చేస్తున్నారని రుణమాఫీ విషయంలో దగా చేశారని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా చేసిన ఘనుడని ఆరోపించారు. కెసిఆర్ ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ పథకం రైతులకు గుదిబండగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఒక కుటుంబం కోసమే పని చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. రైతులపై ముఖ్యమంత్రికి జాలి లేదని నిరంకుశంగా నియంతృత్వ పోకడలతో పోతున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ బేషజాలను విడిచి రైతుల గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని తాము కోరుతుంటే కెసిఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈనెలలోనే నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధం అయితే తాము కూడా అసెంబ్లీలో రైతుల పక్షాన ఎలా వ్యవహరించాలో ప్రణాళికతో ఉన్నామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని రాష్ట్ర రైతాంగం పక్షాన బిజెపి ఎమ్మెల్యేలందరూ నిలబడతామని తెలిపారు.
కెసిఆర్ అవినీతిపై ఫిర్యాదు చేస్తా: నాగం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అవినీతిపై నీతి అయోగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాధర్నాలో నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. తన దగ్గర చాల ఆధారాలు ఉన్నాయని, బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తానని కెసిఆర్ చేసిన అవినీతిపై త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపారు.
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందో శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని గత సంవత్సరం రాష్ట్ర రైతాంగం కరువుబారిన పడితే కేంద్ర ప్రభుత్వం రూ.791కోట్లు పంట నష్టపరిహారం కింద నిధులు ఇస్తే ఇప్పటి వరకు నయాపైసా కూడా రైతులకు చెల్లించలేని మూర్ఖుడని దుయ్యబట్టారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మొక్కజొన్న రైతు సర్వనాశనం అయ్యారని ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ ఆ పంటలను పరిశీలించిన దాఖలాలు లేవని ఆరోపించారు. 2009లో మహబూబ్‌నగర్ రైతుల పుణ్యాన రాజకీయాన్ని బతికించుకున్న కెసిఆర్ ఈ ప్రాంత రైతాంగానే్న ముంచారని 69 జిఓ ద్వారా నిర్మించాల్సిన నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పక్కకు పడేశారని రైతుల ఉసురు కెసిఆర్‌కు తగలక తప్పదన్నారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని అది అంతం కావల్సిన అవసరం ఉందని అందుకు రాష్ట్ర రైతాంగం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీ కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈ పథకం వర్తిస్తే బిజెపికి రైతుల్లో మంచిపేరు వస్తుందని భావించిన ముఖ్యమంత్రి దుర్మార్గంగా రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ఫసల్ భీమా యోజన పథకాన్ని రైతుల ముందుకు బిజెపి కార్యకర్తలు తీసుకెళ్లాలని అప్పుడైన రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు వస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు నాగం పాల్గొన్నారు.

రైతు మహాధర్నాలో ప్రసంగిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్