తెలంగాణ

కెజిబివి టీచర్ల సర్వీసుల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వ పథకం కింద నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి కోరామని పేర్కొన్నారు. కెజిబివిలకు కేంద్రం ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే ఆర్థిక సాయం అందిస్తోందని దీనిని 12వ తరగతి వరకూ పెంచాలని కెజిబివిలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని కూడా కోరామని చెప్పారు. కెజిబివిల ప్రత్యేక అధికారుల వార్షిక సమావేశాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభించారు. కెజిబివిల స్కూలు వేళలు ఉదయం 8 గంటలకే పెట్టడం వల్ల ఇబ్బంది అవుతోందని కనుక ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి యూనియన్లు అక్కర్లేదని, తానే పోట్లాడతానని కడియం వ్యాఖ్యానించారు. మంచి ఫలితాలు సాధించిన టీచర్లను ఆయన అభినందించారు. టీచర్ల సర్వీసుల్లో తేడాలు ఉన్నాయని వాటిని సవరిస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 391 కెజిబివిలు పనిచేస్తున్నాయని అందులో 73వేల మంది బాలికలు చదువుతున్నారని, ఇందుకోసం రాష్ట్రం 212 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. చాలా కెజిబివిలను గతంలో ప్రభుత్వ స్థలాలు ఊరికి దూరంగా ఉన్నా అక్కడే కట్టారని, దీంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కాంపౌండ్ వాల్స్ మంజూరు చేశామని అన్నారు. ప్రతి కెజిబివిలో రాత్రి పూట కనీసం రెండు సార్లు పెట్రోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించామని అన్నారు.
డిగ్రీ విద్యార్థులకు
కంప్యూటర్ నైపుణ్యం
కాగా వేరొక కార్యక్రమంలో డిప్యూటి సిఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్, నాలెడ్జిని అందించేందుకు తెలంగాణ స్టేట్ కంప్యూటర్ నాలెడ్జి సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాణి ప్రసాద్, యునైటెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చీఫ్ క్లిమో షానేట్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమగ్ర విద్యాప్రణాళికలు
నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో సమగ్ర విద్యా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్లతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ప్రస్తుత విద్యా వ్యవస్థ పరిస్థితి, వచ్చే ఐదేళ్లలో విద్యావ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు తయారుచేయాలని సూచించారు.