తెలంగాణ

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో వీలున్నంత త్వరగా ప్రతిపాదిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య గురువారం తెలిపారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయలతో కలిసి నంది ఎల్లయ్య పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీని కలిశారు. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వారు వివరించగా ప్రధాని సావధానంగా విన్నారు. జస్టిస్ ఉషామెహ్రా కమీషన్ సిఫార్సులను ఆమోదించటం ద్వారా వర్గీకరణ చేయాలని తాము మోదీని కోరినట్టు నంది ఎల్లయ్య చెప్పారు.
తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ధర్మ యుద్ధం పేరుతో ఏర్పాటు చేసిన వర్గీకరణ సమావేశానికి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తదితర మంత్రులు, బిజెపి, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకులు హాజరైన విషయాన్ని వారు ప్రధాని దృష్టికి తెచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, తమిళనాడు, పాండిచ్ఛేరి రాష్ట్రాలకు చెందిన మాదిగలు హాజరయ్యారని వారన్నారు.