తెలంగాణ

అంతర్యుద్ధం తప్పదేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: నోట్ల సమస్యపై ప్రజల్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే ప్రమాదం ఉందని పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా, ప్రజలకు ఉపశమనం కలిగించ లేకపోయారని విమర్శించారు. ‘సామాన్యులు పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు. బిజెపి నేతలు మాత్రం వందల కోట్ల ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు’ అని అన్నారు. మోదీ నల్లధనం గురించి మాట్లాడుతున్నారని, మరి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నల్లధనం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. స్వర్ణ్భారతి ట్రస్ట్‌కు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల్లో నల్లధన కుబేరులు చాలా మంది ఉన్నారని అన్నారు. దేశ ప్రజలను మోదీ దొంగల్లా చూస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా డూడూ బసవన్నలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
బ్లాక్ డే
నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న రోజు దేశంలో బ్లాక్ డే అని మాజీ విప్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రజల ఓపిక నశించిన రోజు మోదీకి తగిన శాస్తి తప్పదని అన్నారు.
నేడు సోనియా జన్మదిన వేడుకలు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణ కల సాకారం చేసిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో జన్మదిన వేడుకలు జరపాలని రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటలకు కేక్ కట్ చేస్తారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తారు.