తెలంగాణ

అవినీతిపై ఏసిబి యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: అవినీతి నిరోధక వారోత్సవాలు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఏసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, డైరెక్టర్ చారుసిన్హాల ఆధ్వర్యంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. వారోత్సవాల్లో భాగంగా ఎసిబి అవినీతికి వ్యతిరేకంగా కరపత్రాలు, స్టిక్కర్లు ముద్రించి ర్యాలీల ద్వారా విశేష ప్రచారం నిర్వహించింది.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హైస్కూళ్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు యూనివర్శిటీ విద్యార్థులకు అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పొటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
మహమూద్ మొహినుద్దీన్ అనే వ్యక్తి తనను లంచం అడిగినందుకు కాచిగూడ పోలీస్ సబ్‌ఇన్స్‌పెక్టర్ రమేశ్‌గౌడ్‌ను సాక్ష్యాధారాలతో పట్టించారు. ఈ విషయంలో రమేశ్‌గౌడ్‌కు ఎసిబి కోర్టు కారాగార శిక్ష విధించింది. అలాగే దత్తాత్రేయ జాదవ్ అనే వ్యక్తి జిహెచ్‌ఎంసి బిల్ కలెక్టర్ బి.రమేశ్ తనను లంచం అడిగినందుకు సాక్ష్యాధారాలతో ఎసిబికి పట్టించారు. ఇతనికి కూడా ఎసిబి కోర్టు కారాగార శిక్ష విధించింది.
అవినీతిపరులను చట్టానికి పట్టించి వారికి కఠిన శిక్ష పడేలా కృషి చేసి, అవినీతిని నిరోధించడానికి కృషిచేసినందుకు గాను ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్ శుక్రవారం ఈ ఇద్దరు వ్యక్తులను శాలువా కప్పి, మెమెంటో అందజేసి సత్కరించారు. వీరిద్దరు మిగిలిన వారికి ఆదర్శప్రాయులని కొనియాడారు. అనంతరం అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఎసిబి డిజి ఖాన్ అవినీతికి వ్యతిరేకంగా ఉన్నాతాధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అవినీతిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని సూచించారు.

చిత్రం..అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు కార్య క్రమంలో శుక్రవారం ప్రతిజ్ఞ చేస్తున్న
ఏసిబి ఉన్నతాధికారులు, సిబ్బంది