ఆంధ్రప్రదేశ్‌

టిటిడి బోర్డునుంచి శేఖర్‌రెడ్డి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నేత శేఖర్‌రెడ్డి, అతని బంధువుల ఇళ్లల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. టిటిడి పాలక మండలి నుంచి శేఖర్‌రెడ్డిని తొలగించాలని అధికారులను ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

తలసానిపై క్రిమినల్ కేసు పెట్టాలి: మర్రి

హైదరాబాద్, డిసెంబర్ 10: అక్రమాలను ప్రోత్సహించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని శశిధర్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. అక్రమాలు జరిగాయని తాను చేసిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ జరిపించగా, అందులో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైందని ఆయన తెలిపారు.అక్రమాలకు పాల్పడిన వారిపైనే కాదు ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దీనిపై స్పందించాలని, తలసానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.