తెలంగాణ

నమ్మకమైన వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థానికంగా ఉండాలన్న నిబంధన సడలింపు అన్ని ఆస్పత్రుల్లో త్వరలోనే ఖాళీల భర్తీ
ప్రభుత్వాస్పత్రుల మెరుగుకు భారీగా నిధులు వైద్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పెరిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై క్యాంపు కార్యాలయంలో సిఎం కెసిఆర్ ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. ‘నేను రాను బిడ్డో సర్కార్ దవఖానాకు అని జనం పాటలు పాడుకునే పరిస్థితి పోయి, నేను ఖచ్చితంగా సర్కార్ దవాఖానాకే పోయి వైద్యం చేయించుకుంటాననే పరిస్థితి రావాలి’ అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కోరినన్ని నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని టీచింగ్ హాస్పిటల్స్ వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగు పడాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులన్నింటినీ వందకు వందశాతం భర్తీ చేస్తామని ప్రకటించారు. అవసరమైన మేరకు పోస్టులను వెంటనే మంజురు చేస్తామన్నారు. ప్రతీ హాస్పిటల్లో కొత్త పడకలు, చద్దర్లు, స్టాండ్స్ కొనుగోలు చేయడంతో పాటు భవనాలకు రంగులు, సున్నాలు వేయాలని ఆదేశించారు. ఆస్పత్రులలో వౌలిక సదుపాయాల కల్పనతోపాటు రోజువారీ నిర్వహణకు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్ల దగ్గరే నిధులుండేలా ఏర్పాటు చేస్తామన్నారు. చీపురు కొనాలన్నా సెక్రటేరియట్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఇక నుంచి రాకుండా ఎక్కడికక్కడ అధికారాల బదలాయింపు, నిధుల వినియోగ అధికారాలు కల్పిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో పూర్తి స్థాయి సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ ఆస్పత్రులకు మంచిపేరు తీసుకురావాల్సిన బాధ్యతను డాక్టర్లు తీసుకోవాలన్నారు. ఇక నుంచి ఆస్పత్రుల వారీగా బడ్జెట్ కేటాయించాలని సిఎం సూచించారు. హెచ్‌ఓడిల నుంచి అధికార వికేంద్రీకరణ జరగాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారి వరకు తన పరిధిలో జరగాల్సిన పనులు తామే చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తామని వివరించారు. పరికరాల కొనుగోలు కోసం రాష్టస్థ్రాయిలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌తో కూడిన కమిటీ రేట్లను, నాణ్యతను నిర్ణయించాలని సిఎం ఆదేశించారు. అన్నిరకాల ఆస్పత్రుల్లో మొత్తం 21 వేల పడకలు ఉన్నాయని అధికారులు వివరించగా, బెడ్ల వారీగా నిధులు కేటాయించి ప్రతీ నెలా 25లోగా అవీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగు పర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి వైద్యులు సుముఖంగా లేరని, వారితో అక్కడ పని చేయించడానికి కొన్ని వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు నగదు ప్రోత్సహకంతో పాటు స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధనను సడలించి పొరుగున ఉండే పట్టణాల్లో నివాసం ఉండే అవకాశాన్ని కల్పించాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సంఖ్యను పెంచి షిప్టుల వారిగా పని చేయించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తెచ్చి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పబ్లిక్ హెల్త్ శాఖ పరిధిలోనే ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 108, 104 సేవలను మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో క్యాన్సర్, గైనకాలజీ, పీడియాట్రిక్ తదితర విభాగాలను మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

chitram...
వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్