తెలంగాణ

నగదు రహిత గ్రామానికి వెంకయ్య కితాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11:దేశంలో రెండవ నగదు రహిత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామం నిలిచినందుకు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా నిలిచిందని తెలిపారు. వెంకయ్యనాయుడు ట్విట్టర్ అభినందనలకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోత్సాహంతో సిద్దిపేట నియోజక వర్గం మొత్తాన్ని త్వరలోనే నగదు రహిత నియోజక వర్గంగా అభివృద్ధి చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కొరత ఏర్పడి, వ్యాపార కార్యకలాపాలు మందగించడంతో తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా టి- వాలెట్‌కు రూప కల్పన చేసింది. వారం రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిని ఆవిష్కరించనున్నారు.