తెలంగాణ

ఉస్మానియాలో కిడ్నీ, లివర్ టవర్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైద్య రంగం గాడిలో పడిందని, ప్రజావైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అలుమ్ని (పూర్వ విద్యార్థుల) అసోసియేషన్ గ్లోబల్ మీట్ ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉస్మానియాలో చారిత్రకమైన పాత భవనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త భవనాల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కొత్త భవనాల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని, త్వరలోనే ముఖ్యమంత్రి భవనాలకు శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. కొత్త భవనాల నిర్మాణానికి పరిపాలనా పరమైన అన్ని అనుమతులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఉస్మానియాలో ఈ మధ్య కిడ్నీ, లివర్ పాంక్రియటిస్ వంటి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ఆస్పత్రులు ఆసియాలోనే అరుదైనవని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియాలో కిడ్నీ, లివర్ టవర్స్‌ను ఏర్పాటు చేస్తామని, దీనితో ఇలాంటి ఆపరేషన్లకు మరింత ప్రోత్సహం లభిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే ఆధునిక వసతులతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అవయవ మార్పిడి కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఆవయవ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత రోగులకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను ఉచితంగా అందజేయనున్నట్టు చెప్పా రు. వైద్య రంగంలో ఉస్మానియా ఇప్పటికే అనేక అవార్డులు దక్కించుకుందని అన్నారు. 12 కోట్ల రూపాయల నిధులతో ఉస్మానియాలో వైద్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు లక్ష్మారెడ్డి చెప్పారు. వైద్యం మానవీయ కోణంలో జరగాలని అన్నారు. అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తున్నారనే వాదన బలంగా ఉందని, వైద్యులు దీన్ని నివారించాలని అన్నారు. రోగాలకు చికిత్స చేయడం కాదు, రోగాలు రాకుండా ముందే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రోగాన్ని నివారించేందుకు ముందస్తుగా పరీక్షలు నిర్వహించే సౌకర్యాలను ఆస్పత్రుల్లో పెంచుతున్నట్టు చెప్పారు. రోగ నిర్ధారణ కేంద్రాలు, డయాలసిస్, క్యాన్సర్ కేంద్రాల విస్తరణపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రతిభ కనబరిచిన వైద్యులను ఈ సందర్భంగా మంత్రి సన్మానించారు. గ్లోబల్ మీట్‌లో డాక్టర్ మోహన్‌గుప్తా, డాక్టర్ రమణి, ఆస్పత్రి సూపరిండెంట్ జివిఎస్ మూర్తి, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి