తెలంగాణ

గొలుసుల దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 11: హైదరాబాద్‌లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న కరుడుగట్టిన చైన్ స్నాచర్‌ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దొంగతోపాటు దొంగ బంగారం కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి ఆదివారం విలేఖరులకు తెలిపారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అమీర్ (26) ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నాడు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 15 పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులున్నాయి. ఏడు నెలల వ్యవధిలో 23 చోరీలకు పాల్పడినట్టు డిసిపి వివరించారు. మహమ్మద్ అమీర్ దొంగిలించిన బంగారం అమ్మేందుకు, కొనుగోళ్లకు సహకరించిన ఖాజామోహినుద్దీన్, సయ్యద్ తౌసిఫ్‌లను అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం తుకారంగేట్ పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి తెలిపారు. నిందితుణ్ని పట్టుకున్న ఇన్స్‌పెక్టర్ రాజవెంకటరెడ్డి, నార్త్‌జోన్ ఇనె్స్పక్టర్ బలవంతయ్య, ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్, చంద్రశేఖర్‌రెడ్డిని డిసిపి అభినందించారు. నిందితులను పట్టుకున్న సిబ్బందికి తగిన పారితోషికాన్ని అందజేయనున్నట్టు డిసిపి తెలిపారు.