తెలంగాణ

నక్సల్ దంపతుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 11: నిషిద్ధ సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల-వెంకటపూర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యుడు కుక్కల గణపతి అలియాస్ రాజు, అతని భార్య చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప ఆదివారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగి పోయారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, గణపతి భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం షాపెళ్ళి గ్రామానికి, సర్వక్క భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కనుకనూరు గ్రామానికి చెందిన వారన్నారు. గణపతి చర్ల-వెంకటపూర్ ఏరియా డివిజన్ కమిటీ సభ్యునిగానూ, సర్వక్క ఏరియా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. మావోయిస్టు పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలు, మావోయిస్టు పార్టీపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో పాటు ఆరోగ్య సమస్యల వల్ల వీరిద్దరూ పోరుబాటు వదలి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకొని స్వచ్చందంగా తన ఎదుట లొంగిపోయారన్నారు.
రాజుపై 5 లక్షల రివార్డు
గణపతిపై ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. వ్యవసాయ కూలీగా పని చేస్తున్న గణపతి 1999లో బడే నాగేశ్వరావు అలియాస్ ప్రభాకర్ ప్రోద్బలంతో దళ సభ్యునిగా చేరాడని, ఏటూరునాగారం దళంలో మూడు నెలలు పని చేసిన తరువాత ఇల్లందు దళానికి బదిలీ అయన అతను గాజర్ల సారయ్య అలియాస్ అజాద్ నేతృత్వంలో పని చేస్తున్న ఏటూరునాగారం 1వ ప్లటూన్‌కి బదిలీ అయ్యాడని తెలిపారు. చర్చల సమయంలో ప్లటూన్ వ్యవస్థ రద్దు చేయడంతో దండకారణ్యంకు బదిలీ అయి మద్దెడు ప్రాంతంలో పని చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అలెం తిరుపతి అలియాస్ పున్నం నేతృత్వంలో పని చేస్తున్న డివిజనల్ కమిటి ప్లటూన్ సెక్షన్ కమాండర్‌గా పని చేశాడని చర్ల- వెంకటపూర్ ఏరియా కమిటి మెంబర్‌గా పని చేసి మిలిషియా కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించినట్లు చెప్పారు. చర్ల-వెంకటపూర్ ఏరియా కమిటి డివిజనల్ మెంబర్‌గా ప్రమోట్ అయి ఇప్పటి వరకు అదేస్థాయిలో పని చేస్తున్నాడని ఎస్పీ వివరించారు. కాగా గణపతిపై చాలా కేసులు నమోదై ఉన్నాయి. కాగా సర్వక్కపై ప్రభుత్వం రూ. 4లక్షల రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. సర్వక్క అలియాస్ స్వరూప వ్యవసాయ కూలీగా పని చేస్తున్న క్రమంలో పార్టీ సాహిత్యానికి, పాటలకు ఆకర్షితురాలై జిలానిబేగమ్ అలియాస్ ప్రమీల ప్రోద్బలంతో దళ మెంబర్‌గా చేరిందని, మహాదేవపూర్ దళంలో పని చేసిన తరువాత చింతూర్ దళానికి బదిలీ అయి చర్ల- వెంకటపూర్ ఏరియా కమిటిలో పని చేస్తున్న క్రమంలో 2008లో కుక్కల గణపతి అలియాస్ రాజుతో వివాహం జరిగిందని, ఆమెపై కూడా చాలా కేసులు ఉన్నాయని చెప్పారు.
లొంగుబాట్లను స్వాగతిస్తాం : ఎస్పీ
మావోయిస్టులు హింసాత్మక పద్దతులను విడనాడి జన జీవన స్రవంతిలో కలిస్తే స్వాగతిస్తామని, లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన జీవనం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

చిత్రం..ఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగిపోయిన కుక్కల గణపతి, సర్వక్క