తెలంగాణ

బిజెపికి పెద్ద నోట్ల తలనొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: బిజెపి నేతల గొంతుల్లో వెలక్కాయ పడ్డ చందంగా పెద్ద నోట్ల రద్దు అంశం పడింది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని తెలంగాణ పార్టీ నేతలు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు చేయడం వల్లే నల్ల కుబేరులు బయట పడుతున్నారని ప్రచారం చేయడంతో పాటు మొబైల్, క్రెడిట్, డెబిట్ కార్డులు. ఈ-బ్యాంకింగ్, వ్యాలెట్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితిని పార్టీ నాయకులు అంఛనా వేశారు. నెల రోజులు దాటినా ఎటిఎంలు, బ్యాంకుల వద్ద భారీగా ప్రజల్లో క్యూల్లో నిలుచొవడం, బిజెపిపై గరం-గరంగా ఉండడం గ్రహించారు. నిన్న, మొన్నటి వరకూ పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ బిజెపి నేతలు ఎదురు దాడి చేసినా, అది ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు. కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్ తదితర ప్రాంతాల్లో లోగడ సమావేశాల నిర్వహించినా, ప్రజల్లో సానుకూలత కనిపించలేదన్న భావన వారికి ఏర్పడింది. దీంతో మరో మార్గాన్ని ఆలోచించారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలుచోకుండా, కార్డులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలిపేందుకు గ్రామ బాట పట్టాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి గ్రామాల్లోకి బిజెపి శ్రేణులు వెళ్ళనున్నారు. అయితే తొలుత గ్రామాలకు వెళ్ళే వారికి కార్డులు ఏ విధంగా ఉపయోగించాలన్న అంశంపై శిక్షణనిస్తున్నారు.
దత్తాత్రేయ శిక్షణ
ఇలాఉండగా బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిథిలోని పార్టీ ముఖ్య నాయకులతో, సుమారు 500 మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, కార్డు ఉపయోగం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. నోట్ల రద్దు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని వారికి చెప్పారు. 16 నుంచి ప్రజల్లోకి వెళ్ళి డిజిటల్ లిటరసీపై వివరించాలని ఆయన సూచించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నా, ఓర్పుతో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఈ-లావాదేవీలు ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు బయటపడుతున్నారని, మహిళల బంగారం జోలికి తాము వెళ్ళమని పార్టీ శ్రేణులు వివరించనున్నారు.