తెలంగాణ

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా బాధపడకూడదన్నది నా అభిమతం. అందుకే నిబంధనల ప్రకారం సాధ్యం కాదంటున్నా మానవతా దృక్పథంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం’ వారం రోజుల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. ‘ఒకే పని చేసే ఉద్యోగులకు ఒకేరకంగా వేతనం ఉండాలి. పర్మనెంట్ ఉద్యోగైనా, కాంట్రాక్టు ఉద్యోగి అయినా చేసే పని ఒక్కటే అయినప్పుడు జీతం మాత్రం ఒక్కటే ఎందుకు ఉండదు?. నా దృష్టిలో కాంట్రాక్టు వ్యవస్థ వెట్టి చాకిరిలాంటిదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తాం’ ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ అధినేతగా కెసిఆర్ చేసిన ప్రకటన.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం అతీగతి లేకుండా పోయింది. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఎటూ తేలకుండా ఉండగా, తాజాగా విద్యుత్‌శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పక్షంలో ఇది ఒక్క విద్యుత్ శాఖకు మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానంపై పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 80,861 మంది కాగా కాంట్రాక్టు విధానంపై పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 25,589 మంది ఉన్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధికారికంగా ప్రకటించిన లెక్క ఇది. 25,589 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రెండున్నర ఏళ్లుగా అతీగతి లేకుండా అటకెక్కిన నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యమేనా అన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వేషన్ రోస్టర్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, వయో పరిమితి తదితర అన్ని అర్హతలు కలిగి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించ వచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇదే కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన విషయం ఇక్కడ గమనార్హం. టిఆర్‌ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అధికార పగ్గాలు చేపట్టిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ చేసినా ఎవరైనా న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే క్రమబద్ధీకరణ నిలువదని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎలా సాధ్యం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం చేసినా అది న్యాయ స్థానంలో నిలబడుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీ, ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిన క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ కష్టమేనని ఆర్థికశాఖ అధికారులు విశే్లషిస్తున్నారు.