తెలంగాణ

జయలలిత ఆస్తుల గురించి చెప్పరేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: గత మే నెలలో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఇటీవల మరణించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించారని , అందులో కొన్ని ఆస్తులు హైదరాబాద్‌లోనూ ఉన్నట్టు పేర్కొన్నారని దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంటూ గరీబ్ గైడ్ ఎన్‌జిఓ ప్రతినిధి భార్గవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జయలలిత ఆస్తులు 113.73 కోట్లు ఉన్నాయని, వాటిలో మేడ్చల్ గ్రామంలో 14 ఎకరాలు భూమి ఉందని, అలాగే శ్రీనగర్ ఏరియాలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారని, ఆమెకు భర్త లేదా పిల్లలు లేరని పిటిషనర్ అఫిడవిట్‌లో వివరించారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?
అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ సంతోష్‌కుమార్ ఒక పిల్ దాఖలు చేశారు. హెచ్‌బి కాలనీలో ఇళ్లు వాణిజ్య సముదాయాలుగా మారుతున్నాయని, నాలుగు అంతస్తులు నిర్మించి పెంట్ హౌస్‌లు వేస్తున్నా పట్టించుకోవడం లేదని తన పిల్‌లో పేర్కొన్నారు.