తెలంగాణ

వేటగాళ్ల ఉచ్చుకు చిరుతపులి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 11: వేటగాళ్ల ఉచ్చులో పడి కోటపల్లి మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవకముందే ఆదిలాబాద్ అటవీ డివిజన్ పరిధిలో మరో చిరుతపులి మృతి చెందిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. అడవులకు నిలయమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరసగా వన్యప్రాణులు బలవుతున్న సంఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగా పరివాహక ప్రాంతమైన భీంపూర్ మండలం తాంసికె గ్రామ సమీపంలోని బొర్లగుట్ట అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతదేహాన్ని చూసి పశువుల కాపర్లు గ్రామ సర్పంచ్‌కు తెలిపారు. ఆదిలాబాద్ డి ఎఫ్‌వో రాంబాబుకు ఆదివారం నాడు సమాచారం అందించగా చిరుతపులి చర్మం, గోళ్లు కలిగి ఉండడంతో ఇది స్మగ్లర్ల పనికాదని అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వెంటనే డిఎఫ్‌వో రాంబాబు నేతృత్వంలో పశుసంవర్ధక శాఖ వైద్యులు శ్రవణ్‌కుమార్ అధ్వర్యంలో శవపంచనామ నిర్వహించి కళేబరం శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వెంటనే వన్యప్రాణి విభాగం ఉన్నతాధికారులకు సమాచారం అందించి, చిరుతను దహనం చేశారు. నెల రోజులుగా చిరుతపులి తాంసి, భీంపూర్ మండలాల్లో సంచరిస్తూ ఇప్పటికే గొల్లఘాట్, తాంసికె, పిప్పల్‌కోటి, నిపాని గ్రామాలకు చెందిన నాలుగు పశువులను వేటాడి చంపినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. చిరుత సంచారంపై గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో కొందరు పులిని మట్టుబెట్టేందుకు విషాహారం ఎరగా వేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మృతదేహం లభ్యమైన చిరుతకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు డి ఎఫ్‌వో రాంబాబు తెలిపారు.