తెలంగాణ

ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ఎన్‌ఆర్‌ఐ పాలసీ తెస్తున్నామంటూ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ నేత, తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత వరకు కనీసం పాలసీని రూపొందించలేదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థకు కేటాయించే నిధులను ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమార్తె కవిత నిర్వహిస్తున్న జాగృతి సంస్థకు కేటాయించడం అనైతికమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గల్ఫ్‌లో, అక్కడి జైళ్లలో ఉన్న 35వేల మందిని విడిపించి ప్రత్యేకవిమానాల్లో రాష్ట్రానికి తీసుకుని వచ్చామన్నారు. ఈ ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలేమీ చేయకపోవడంతో అక్కడ అనేక మంది తెలంగాణకు చెందిన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గల్ఫ్ దేశాల్లో 400 మంది తెలంగాణవాసులు మరణించారని ఆయన తెలిపారు. 16 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ శీతాకాల సమావేశాల్లోనైనా ఎన్‌ఆర్‌ఐ పాలసీని ప్రవేశపెట్టి ఆమోదించాలని షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.