తెలంగాణ

ఇక బస్సుల్లో పిఓఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రవాణాశాఖలో వంద శాతం నగదు రహిత కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు, దీని కోసం అవసరం అయిన ఏర్పాట్లు చేస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి పూర్తి స్థాయిలో నగదు రహిత కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నగదు రహిత కార్యకలాపాల్లో తెలంగాణ రవాణాశాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచినట్టు చెప్పారు. కరెన్సీ రద్దు కన్నా ముందు నుంచే రవాణాశాఖలో నగదు రహిత కార్యకలాపాలు గత ఆగస్టు నుంచి ప్రారంభించినట్టు చెప్పారు. రవాణాశాఖ ఆదాయ లక్ష్యం 2800 కోట్ల రూపాయలు కాగా, 1431 కోట్ల రూపాయలు నగదు రహితంగానే వచ్చినట్టు చెప్పారు. రవాణాశాఖలో నగదు రహిత కార్యకలాపాలపై రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం రవాణాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్‌టిసి ఎండి రమణారావు, జెటిసిలు, డిటిసిలు పాల్గొన్నారు. 54 రవాణా శాఖ కార్యాలయాలు, 15 చెక్ పోస్టులలో స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అదే విధంగా ఆర్టీసి బస్సుల్లో పిఓఎస్ మిషన్‌లు ఏర్పాటు చేసి నగదు రహితంగా సేవలు అందించనున్నట్టు చెప్పారు.