తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వకు నిలిచిన నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, డిసెంబర్ 12: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమకాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీటిని సోమవారం నాడు డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమకాల్వకు ఆరుతడి పంటలకు గాను నీటివిడుదల చేసిన అధికారులు గతంలో నీటివిడుదల నిలిపివేశారు. ఆయకట్టు పరిదిలో వేసిన పంటలు చివరి దశలో ఉన్నందున పంటను కాపాడుకోవాలంటే మరో వారంరోజులపాటు ఎడమకాల్వకు నీటి విడుదల చేయాలని రైతు ప్రతినిధులు చేసిన వినతి మేరకు ఈనెల 4నుండి ఎడమకాల్వకు నీటివిడుదల కొనసాగిస్తున్నారు. ప్రకటించిన గడువు కంటే రెండు రోజులు ఎక్కువగానే 9రోజులపాటు నీటివిడుదల చేసిన అధికారులు సోమవారం నిలిపివేశారు. ఈసందర్భంగా ప్రాజెక్టు ఎస్‌ఇ సునీల్ మాట్లాడుతూ ఈ 9 రోజులలో రైతుల అభ్యర్ధన మేరకు వదిలిని నీరు 3.5 టిఎంసిలు ఉంటుందని తెలిపారు. యాసంగి పంటకుగాను ఎడమకాల్వ పరిదిలో నీటివిడుదల విషయమై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నీటి పంపకాలు పూర్తిస్థాయిలో కానందున ఈనెల 13 తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.