తెలంగాణ

ఆ జైలు ఇక మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: జైలు జీవితం అంటే ఏ విధంగా ఉంటుంది.. శిక్షలను ఏ విధంగా అమలు చేస్తారు.. శిక్ష పూర్తిగా అమలయ్యే వరకు నాలుగు గోడల మధ్య బాహ్య ప్రపంచాన్ని చూడకుండా ఉండే విధానాలను సాధారణ వ్యక్తులు కూడా తెలుసుకునే వెసులుబాటును జైళ్ల శాఖ కల్పించనుంది. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా జైలు మ్యూజియాన్ని మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సంబంధిత శాఖ అధికారులు ‘వారసత్వ సంపద కారాగార ప్రదర్శన శాల’ పేరుతో ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రెండువందల సంవత్సరాలకు పూర్వం నైజాం కాలంలో నిర్మించిన గుర్రపుశాల తదనంతరం జైలుగా రూపుదిద్దుకుంది. నేరస్థులకు శిక్షలు అమలుకావడం, రిమాండ్ ఖైదీల సంఖ్య పెరగడం, నేటి కాలానికి అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా జైలును కంది గ్రామ శివారులో కొత్తగా నిర్మించారు. అప్పటి నుంచి పాత భవనం వృథాగా ఉంది. జిల్లాపై ఉన్న అవగాహన, జైళ్ల శాఖ డిజిగా బాధ్యతలు స్వీకరించిన వికె.సింగ్ పురాతన జైలు భవనాన్ని మ్యూజియంగా మార్చాలని సంకల్పించారు. ఇందుకుగాను జైళ్ల శాఖ నుంచి రూ.40 లక్షలు కేటాయించి శిథిలమైన భవనాన్ని మరమ్మతులు చేయించారు. ఒక్కో నేరానికి ఏ విధమైన శిక్షలు ఉంటాయనే విషయాలను సామాన్య వ్యక్తులు అర్థం చేసుకునే విధంగా చిత్రకారులతో బొమ్మలు వేయించి సూక్తులను కూడా రాయించారు. పర్యాటకులు సేద తీరడానికి మధ్యమధ్యలో కుర్చీలను అమర్చారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని ఏర్పాటు చేసారు. జైళ్లలో తయారు చేసే వివిధ రకాల వస్తువులను విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించనున్నారు. జైలు మ్యూజియంగా తీర్చిదిద్దడంలో విశేషంగా కృషి చేసిన జైళ్ల శాఖ డిజి వికె.సింగ్, క్షేత్రస్థాయిలో అన్ని చక్కబెట్టిన జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌ల పేర్లు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోనున్నాయి.

రేగా దీక్ష భగ్నం
ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగింపు
భద్రాచలం, ఫిబ్రవరి 24: ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరులో సింగరేణి భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్‌తో చేస్తున్న నిరాహార దీక్షను బుధవారం తెల్లవారుఝామున పోలీసులు భగ్నం చేశారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ కూడా కాంతారావు దీక్ష కొనసాగిస్తున్నారు. కాంతారావు దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. గిరిజన సంఘాలు కూడా తోడై భద్రాచలంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశాయి. కాంతారావు దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారనే సమాచారంతో సింగరేణి భూ నిర్వాసితులంతా భద్రాచలం చేరుకుని ఆసుపత్రిలో బైఠాయించారు. ఆయనతోపాటు పద్దం శ్రీను, సీతారాములు, గుగులోతు రమేశ్ అనే నిర్వాసితులు కూడా దీక్ష చేస్తున్నారు. వీరిలో సీతారాములు, రమేశ్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో బలవంతంగా వైద్యం అందించారు.

ఘనంగా
తిరుగువారం
గోవిందరావుపేట, ఫిబ్రవరి 24: మేడారం పూజారులకు పవిత్ర దినంగా జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారాన్ని తిరుగువారంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో పూజారులు వారి కుటుంబసభ్యులను, బంధుమిత్రులను మేడారం ఆహ్వానించి విందుభోజనాలతో తృప్తిపరుస్తారు. ఈ క్రమంలోనే బుధవారం మేడారంలోని సమ్మక్క తల్లి ఆలయం వద్ద పూజారులు ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కనె్నపెల్లి ఆలయం వద్ద సైతం పూజారులు ప్రత్యేక పూజలు చేసారు. దీంతో అటు కనె్నపెల్లి, ఇటు మేడారం గ్రామాలలో పండగ వాతావరణం కనిపించింది. స్ధానికులు సైతం ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజారుల ఆశీస్సులు తీసుకున్నారు.
కొత్త వాహనాలు కొనుగోలు చేసి వాహన పూజ జరిపించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావుతోపాటు పలువురు పూజారులు పాల్గొన్నారు.