తెలంగాణ

వేములవాడకు కొత్త సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ రూరల్, డిసెంబర్ 12: వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, భక్తులకు మరింత మెరగైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామరావుచెప్పారు. ఆలయ అభివృద్ధిపై సోమవారం ‘వాడా’ వైస్ చైర్మన్ పురుషోత్తమరెడ్డి, జిల్లా అధికారులతో కలసి ఓపెన్ స్లాబ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలయం, పట్టణం వేరువేరు కాదని, రెండింటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, అందుకు పూర్తిస్థాయి ప్రణాళికలను రూపొందించామని చెప్పారు. దేవాలయానికి కిలోమీటర్ మేర నాలుగు వైపులా ఫ్లాట్‌ఫారంలను నిర్మిస్తామని, ఆలయాన్ని విస్తరించడానికి అవసరమయ్యే భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరుకుగా ఉన్న రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటామని, పట్టణమంతటా ఎల్ ఇడి లైట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బహిరంగ మలవిర్జన రహిత పట్టణంగా మార్చడానికి పట్టణంలో పది పాయింట్లను ఎంపిక చేసి మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు.
ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
భక్తుల సౌకర్యార్థం మీ సేవ అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సేవలను సోమవారం అధికారికంగా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి సాంకేతికతతో కూడిన ఆన్‌లైన్ సేవలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం జయశెట్టి రమణయ్య రచించిన వేములవాడ క్షేత్ర మహిమలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలో సుమారు 16.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. కాగా మంత్రి కేటీఆర్‌కు శ్రీ రాజరాజేశ్వరస్వామి చిత్రపటాన్ని, స్వామివారి ప్రసాదాలను ఇవో రాజేశ్వర్ అంజేశారు. ముందుగా ఆలయ వేదపండితులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి ఆశీర్వదించారు.

చిత్రాలు..ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవలను ప్రారంభిస్తున్న మంత్రి * తిప్పాపూర్-నాంపల్లి నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న కెటిఆర్