తెలంగాణ

ముస్లిం రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయం నేటి నుండి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణలో విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లను నాలుగు శాతం నుండి 9 శాతంపైగా పెంచే అంశంపై రాష్ట్ర బిసి కమిషన్ ‘ప్రజా విచారణ-అభిప్రాయ సేకరణ’ జరపాలని నిర్ణయించింది. ఈ అభిప్రాయ సేకరణ ఈ నెల 14 నుండి 17 వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తమ కార్యాలయంలో (హైదరాబాద్ మెట్రోవాటర్‌వర్క్స్ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్ వెనుక ఉన్న బ్లాకు) కొనసాగిస్తామని కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, డాక్టర్ ఆంజనేయగౌడ్, జూలురు గౌరీశంకర్ తెలిపారు. కమిషన్ పేరుతో మంగళవారం అధికారికంగా ఈ అంశం ప్రకటించారు. ముస్లింల సామాజిక, విద్య, ఆర్థికాంశాలపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జి. సుధీర్ కమిషన్ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో ముస్లింలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్లను 4శాతం నుండి పెంచుతూ 12 శాతంలోగా హెచ్చించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులపై ప్రజా విచారణ చేసి రిపోర్టు అందించాలంటూ తెలంగాణ ప్రభుత్వం బిసి కమిషన్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు అధికారిక ప్రకటనలో వివరించారు. ఆసక్తికలవారు, కుల, మత సంఘాలు, సంస్థలు విచారణా కార్యక్రమంలో పాల్గొని లిఖితపూర్వకంగా లేదా వౌఖికంగా అభిప్రాయం చెప్పాలని కోరారు. కమిషన్ నోటిఫికేషన్‌లో పొందుపరిచిన ‘్ధృవీకరణ అఫిడవిట్’ను తప్పనిసరిగా పూర్తి చేసి తమ అభిప్రాయాలను ఆరుప్రతులు అందచేయాలని సూచించారు. ఈ మెయిల్ ద్వారా కూడా అభిప్రాయాలు పంపించవచ్చని కమిషన్ చైర్మన్, సభ్యులు వివరించారు. ఆన్‌లైన్‌ద్వారా, పోస్ట్‌ద్వారా తెలియచేయడానికి ఈ నెల 19 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఇస్తున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది.