తెలంగాణ

పోస్ట్ఫాసుల్లోనే అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: నోట్ల మార్పిడి కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్‌లోని పోస్ట్ఫాసుల్లోనే అధిక నగదు మార్పిడి జరిగినట్టు సిబిఐ గుర్తించింది. హైదరాబాద్‌లో రూ. 3.75 కోట్లు నగదు మార్పిడి జరిగినట్టు సిబిఐ నిర్ధారించింది. వీటిలో పోస్ట్ఫాసుల్లోనే సగానికి పైగా లావాదేవీలు కమీషన్ దందాపైనే జరిగినట్టు సిబిఐ గుర్తించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ, బషీర్‌బాగ్ తదితర సబ్-పోస్ట్ఫాసుల్లో సుమారు రూ. 3 కోట్లకు పైగానే నగదు మార్పిడి లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు సిబిఐ గుర్తించింది. హైదరాబాద్‌లోని పోస్టల్ శాఖకు చెందిన సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్‌తోపాటు సబ్-పోస్టుమాస్టర్లు రేవతి, రాజశేఖరరెడ్డిలను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు బ్యాంక్ అధికారులను కూడా సిబిఐ విచారిస్తోంది.
నగదు మార్పిడి జరుగుతోందిలా..
బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీని డ్రా చేసే అధికారం కేవలం హెడ్ పోస్ట్ఫాసు చీఫ్ సూపరింటెండెంట్‌కు ఉంటుంది. అయితే వాటి పరిధిలోని సబ్-పోస్ట్ఫాసులకు నగదు పంపించే ఇండెంట్‌పై పర్యవేక్షణ అధికారం మాత్రం సంబంధిత డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్‌కు ఉంటుంది. దీంతో సదరు అధికారి తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని వినియోగించుకుని అక్రమాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి హెడ్ పోస్ట్ఫాసుల ద్వారా పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీని డ్రా చేయించి వాటిని సబ్-పోస్ట్ఫాసులకు సుమారు కోటి నుంచి రూ. 2 కోట్ల చొప్పున పంపిణీ జరిగేలా చూశారు. అయితే భద్రత దృష్ట్యా సబ్ పోస్ట్ఫాసులు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ దగ్గర పెట్టుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు. దీంతో సబ్ పోస్ట్ఫాసులతో లేఖ తీసుకుని తిరిగి హెడ్ పోస్ట్ఫాసులకు కొత్త కరెన్సీ అప్పగింత సమయంలో చేతివాటాన్ని ప్రదర్శించినట్టు సిబిఐ గుర్తించింది.