తెలంగాణ

ఆర్బీఐ వద్దన్నా వినలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆర్‌బిఐ వద్దని చెప్పినా ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ పకడ్బందీగా తన నిర్ణయాన్ని అమలు చేసి ఉన్నట్లయితే ఇన్ని వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు బయటకు ఎలా వస్తాయని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. పైగా కొత్త నోట్లు బ్యాంకులకు, ఎటిఎంలకు ఎలా చేరవేయాలో ఆలోచన చేయకుండానే అమలు చేయడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలే ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. ప్రధాని నిరంకుశ విధానంతో దేశాన్ని గోతిలో పడేసి, తానూ అదే గోతిలో పడ్డారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు.నిన్నటి వరకు బ్యాంకులకు 13 లక్షల కోట్ల రూపాయలు చేరాయని, ఇక రావాల్సిందిగా లక్షా 14 వేల కోట్ల రూపాయలేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుభవం ఉన్నట్లయితే వేల కోట్లలో కొత్త నోట్లు ఎలా బయటకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ‘ఎవరీ శేఖర్ రెడ్డి, ఆయన వద్దకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చింద’ని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి వచ్చిందా? కాదా? అని ఆయన అన్నారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న బ్యాంకును అదుపులో పెట్టలేని వారు నల్లధనాన్ని ఎలా అదుపు చేస్తారని ఆయన ప్రశ్నించారు. శేఖర్ రెడ్డి వద్ద లభించిన డబ్బు ఎవరిది?, ఇంకా ఎవరికైనా బినామీగా ఉన్నారా? అని ప్రశ్నించారు. కొత్తగా నోట్లు ముద్రిస్తున్నందుకు 25 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుండగా, కనీసం అంత నల్లధనం కూడా రాలేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనంపై ధర్మయుద్ధం చేస్తున్నట్లు, ప్రతిపక్షాలన్నీ అడ్డుపడుతున్నట్లు బిజెపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

చిత్రం..మంగళవారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి