తెలంగాణ

350 కోట్లతో పోలీస్‌శాఖ ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి/బీబీనగర్, డిసెంబర్ 13: శాంతి భద్రతలను కాపాడడంతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని, 350 కోట్ల రూపాయలతో పోలీస్ శాఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో 25 లక్షల రూపాయల రాష్ట్రప్రభుత్వ నిధులతో నిర్మించిన మహిళా పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని, బీబీనగర్ మండల కేంద్రంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని నాయిని మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్టవ్య్రాప్తంగా 48 కోట్ల రూపాయలతో 24 ఆధునిక పోలీస్‌స్టేషన్లను నిర్మిస్తాన్నారు. పాత పోలీస్ స్టేషన్లను పునరుద్ధరిస్తూ కొత్త పోలీస్ స్టేషన్లను నిర్మించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాహనాలను పోలీసులకు సమకూర్చి పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంచామన్నారు. పోలీస్‌శాఖలో మహిళలకు 32 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునిత, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అడిషినల్ డిజి అంజన్‌కుమార్, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, పోలీస్ హౌజింగ్ ఎండి మల్లారెడ్డి, జాయింట్ సిపి శశిధర్ రెడ్డి, భువనగిరి జోన్ డిసిపి యాదగిరి, ఎసిపి మోహన్ రెడ్డి, ఎసిపి స్నేహలత పాల్గొన్నారు.