తెలంగాణ

జాతీయ జూడో చాంపియన్ హర్యానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 13:జాతీయ స్థాయి పాఠశాలల జూడో బాల బాలికల చాంపియన్ షిప్‌ను హర్యానా కైవసం చేసుకుంది. ఆ జట్టుకు 42 పాయింట్లు రాగా 25 పాయింట్లతో మణిపూర్ రన్నరప్‌గా నిలిచింది. ఇక 17 పాయింట్లు సాధించిన పంజాబ్ తృతీయ స్థానంలో నిలిచింది. కరీంనగర్‌లోని మానేర్ హైస్కూల్‌లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 62వ జాతీయ జూడో పోటీలు మంగళవారం ముగిసాయి. చివరిరోజు జరిగిన బాలికల 61 కిలోల విభాగంలో పుష్పదేవి (మణిపూర్) స్వర్ణం, గిన్ని (పంజాబ్) రజతం, మహిమాపాఠక్ (విద్యాభారతి), వసుంధర (కర్నాటక) కాంస్యం సాధించారు. 61 కిలోల పైబడిన విభాగంలో అమీషా (్ఢల్లీ) స్వర్ణం, సంయోగిత (హర్యానా) రజతం, విధి శర్మ (గుజరాత్), అథిశ్రీ (మహారాష్ట్ర) కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. బాలుర 71 కిలోలలోపువిభాగంలో మన్‌ప్రీత్ (పంజాబ్) స్వర్ణం, ఆదిత్య (మహారాష్ట) రజతం, నరేష్ (హర్యానా), మణిందర్ (్ఢల్లీ) కాంస్య పతకాలు సాధించగా, 71 కిలోల పైబడిన విభాగంలో లలిత్ (హర్యానా) స్వర్ణం, హమీద్ (జమ్ముకాశ్మీర్) రజతం, అర్జున్ (కేరళ), గుర్విందర్ (రాజస్థాన్) కాంస్యం సాధించారు. తెలంగాణ నుంచి కేవలం ప్రియాంక మాత్రమే రజతం సాధించడంతో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలకు రాష్ట్ర ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డి, డివైఎస్వో అశోక్‌కుమార్, డిఇఓ రాజీవ్, మానేర్ విద్యాసంస్థల అధినేత అనంత రెడ్డి, క్రీడా సమాఖ్య కార్యదర్శి పి.తిరుపతి రెడ్డి, జూడో సంఘం ప్రతినిధులు రమేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కైలాస్‌యాదవ్, ప్రభాకర్ రెడ్డి, ఆర్.శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.