తెలంగాణ

కెసిఆర్ ఒఎస్‌డిగా మళ్లీ దేశపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి ఒఎస్‌డిగా కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ను తిరిగి నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దేశపతి శ్రీనివాస్ గతంలో సిఎం ఒఎస్‌డిగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఇతర విధులు నిర్వహించకూడదని, వారి డిప్యూటేషన్లను రద్దు చేయాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు వరంగల్ జిల్లా ములుగు మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దేశపతి శ్రీనివాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం తిరిగి ముఖ్యమంత్రి ఒఎస్‌డిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.